Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

డెత్‌ మిస్టరీ: ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్‌ ఎలా చనిపోయింది?

Family Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Aileen_20Conway_20The_20Unsolved_20Mysterious_20Death-01.jpg

అది 1986 ఏప్రిల్‌ 29.. ఉదయం పది నలభై దాటింది. అమెరికా, ఓక్లహోమాలోని లాటన్‌ హైవే పక్కన పాడుబడిన వంతెనపైన మంటలు ఎగసిపడుతున్నాయి. కాస్త దూరం నుంచి వాటిని గమనించిన ఓ రైతు.. వెంటనే ఫైరింజిన్‌కి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సరిగ్గా 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పి.. పరిశీలనగా చూసేసరికి.. కారు డ్రైవింగ్‌ సీట్‌లో ఓ అస్థిపంజరం కలవరపరచింది.

కారు అదుపు తప్పి.. క్రాష్‌ అయ్యిందని భావించిన అధికారులు.. కారు ఎవరిది? కారులో ఉన్నది ఎవరు? లాంటి ప్రశ్నలతో, క్లూ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాసేపటికి ఆ కారు పాత్‌ కాన్వే అనే 33 ఏళ్ల వివాహితుడిదని గుర్తించారు. దాంతో చనిపోయింది అతడి భార్య ఐలీన్‌ కాన్వే అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ హైవే.. వాళ్ల ఇంటికి కేవలం పదిహేను మైళ్ల దూరంలో ఉంది. తాను మంటల్ని గుర్తించే సమయానికి ఏ అరుపులు వినిపించలేదని రైతు చెప్పడంతో అధికారులు.. అప్పటికే ఐలీన్‌ ప్రాణం పోయి ఉంటుందని భావించారు. కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్‌ జరిగే సమయానికి కారు స్పీడ్‌ 50 నుంచి 60 లోపే ఉందని అధికారులు అంచనా వేశారు.

ఆ మాత్రం వేగానికి అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు పాత్‌.. ఇంటికి వెళ్లి, అక్కడ పరిస్థితి చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంట్లో.. ఐలీన్‌ మాత్రమే ఒంటరిగా ఉందని తనకు బాగా తెలుసు. కానీ అక్కడ కొన్ని ఆనవాళ్లు అతడ్ని గజగజ వణికించాయి. ఇంటి ముందు గార్డెన్‌లో వాటర్‌ పైప్‌ చాలా సేపటి నుంచి పొంగడంతో ఆ నీళ్లు స్మిమ్మింగ్‌ పూల్లోకి పోవడం గమనించాడు. వెంటనే దాన్ని ఆఫ్‌ చేసి ఇంట్లోకి నడవబోయాడు. అయితే ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో.. అతడిలో అనుమానం మొదలైంది. దానికి తోడు హాల్లో ఐరన్‌ బాక్స్‌ కాలిపోయి ఉంది. బట్టలు ఇస్త్రీ చేయడానికి స్విచ్‌ ఆన్‌ చేసి ఎన్నో గంటలైందని అక్కడ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

పాత్‌ అడుగులు.. ఆందోళనగా ముందుకు కదిలాయి. మాస్టర్‌ బాత్‌రూమ్‌లో బాత్‌ టబ్‌ పక్కనే ఉన్న టెలీఫోన్‌ రిసీవర్‌ పక్కకు తీసి, దాని హుక్‌ లాగినట్లుగా కనిపించింది. వెంటనే పాత్‌ కంగారు కంగారుగా ఇల్లంతా వెతికాడు. ఓ చోట భార్య డ్రైవింగ్‌ లైసెన్స్, కళ్లజోడు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ కనిపించింది. హ్యాండ్‌బ్యాగ్‌ కూడా వదిలిపెట్టి.. కారులో ఎక్కడికి బయలుదేరింది? ఆమెకు డ్రైవింగ్‌ అనుభవం ఉన్నాకూడా ఎందుకు యాక్సిడెంట్‌ అయ్యింది? పాత్‌ దగ్గర అన్నీ ప్రశ్నలే మిగిలాయి. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి.. తన భార్య మరణమై అనుమానాలు ఉన్నాయని.. కంప్లైంట్‌ ఇచ్చాడు. యాక్సిడెంట్‌ అయిన చోటును పాత్‌ కానీ, ఐలీన్‌ కానీ అంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. వెంటనే జిల్లా న్యాయవాది కార్యాలయంలోని రే ఆండర్సన్‌ని సంప్రదించాడు.

మొదట ఆండర్సన్‌.. పాత్‌ వాదనను నమ్మలేదు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నాడని భావించాడు. అయినా పాత్‌.. తన ప్రయత్నాలు ఆపలేదు. యాక్సిడెంట్‌ జరిగిన చోటే క్లూ కోసం వెతకడం మొదలుపెట్టాడు. కారు కాలిపోయిన చోటికి 200 అడుగుల దూరంలోని చర్చి బులెటిన్‌ కనిపించింది. అది ఐలీన్‌ హాజరైన చర్చ్‌కి సంబంధించిందే. పాత్‌.. దాన్ని చివరిగా కారు డాష్‌బోర్డ్‌లో చూశాడు. ఐలీన్‌కి ఎప్పుడూ కారు విండోస్‌ క్లోజ్‌ చేసి.. ఎయిర్‌ కండిషనింగ్‌ ఆన్‌తో డ్రైవింగ్‌  చేయడం అలవాటు.

అలాంటప్పుడు చర్చి బులెటిన్‌ కదులుతున్న కారు నుంచి బయటకు రావడం అసాధ్యం. అంటే ఆ కారులో ఐలీన్‌తో పాటు కిల్లర్‌ ఉన్నాడని పాత్‌ ఊహించాడు. ప్రాణాలతో లేని / సృహలో లేని ఐలీన్‌ని కారు డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోబెట్టి.. యాక్సిలేటర్‌ని పెంచేసి, కారు ముందుకు పోయేలాచేసి ఉంటారని పాత్‌ బలంగా నమ్మాడు. యాక్సిడెంట్‌ అయిన తర్వాతే కారుకు నిప్పు పెట్టి ఉంటారని భావించాడు. తన అనుమానాలను అధికారులకు బలంగా వినిపించి.. కేసు హిస్టరీలో ప్రమాదవశాత్తు అనే పదానికి బదులు అనుమానాస్పద మృతి అని మార్పించాడు. ఏది ఏమైనా ఆమె మరణానికి అసలు కారణం మాత్రం తేలలేదు.



ఊహాగానాలు..

ఐలీన్‌ మరణానికి వారం క్రితం ఆ పరిసరప్రాంతాల్లో దొంగలు పెట్రేగిపోయారు. ఎవరూ లేని ఇళ్లపై దోపిడీలు చేసిన కేసులు చాలానే నమోదయ్యాయి. ఐలీన్‌ ఇంట్లో ఉందనే విషయం తెలియక.. ఆ దొంగల ముఠా ఆ ఇంటిపై దాడిచేసి ఉంటారని.. ఐలీన్‌ వాళ్లను చూడడంతో ఆమెను చంపేసి యాక్సిడెంట్‌లా క్రియేట్‌ చేసి ఉంటారని పాత్‌తో పాటు చాలామందే నమ్మారు. అయితే ఐలీన్‌ హెల్త్‌ హిస్టరీ తెలిసిన కొందరు.. ఆమెకు ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చి ఉంటుందని.. ఆ మెడికల్‌ ఎమర్జెన్సీతో ఇంటి పనులన్నీ మధ్యలోనే వదిలిపెట్టి ఆసుపత్రికి తనంతట తానే కారులో బయలుదేరి ఉంటుందని.. దారిలో అనుకోకుండా ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. 

అయితే న్యాయపోరాటం చేస్తున్న పాత్‌ దురదృష్టవశాత్తు 2013లో.. నిజం తెలుసుకోకుండానే మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఫ్రైడ్‌ కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాడు. 2018లో అతడు కూడా కన్నుమూయడంతో ఈ కేసు కోల్డ్‌ కేసుల సరసన చేరి.. అపరిషృతంగానే మిగిలిపోయింది. నిజానికి ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్‌ ఎలా చనిపోయింది? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు.

∙సంహిత నిమ్మన

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
family
mystery
mysterious death
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.