Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు

Family Sakshi User Sakshi Sakshi Time Aug 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
womenandai.jpg

దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా.  

వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.

చదవండి: బాల అమితాబ్‌ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి

వర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్‌ సైన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బిగ్‌ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.

వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. 

ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి.                                                                          
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య  హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.

-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Technology
women
empowerment
Artificial Intelligence (AI)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.