Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..

Family Sakshi User Sakshi Sakshi Time Apr 2, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
plant3.jpg

అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది.  పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది.  నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 

275కు పైగా రకాలు
అగవె సక్యులెంట్‌ ప్లాంట్‌. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. 

ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.

దైవమిచ్చిన పంట! 
మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్‌టెక్‌ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్‌ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్‌ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్‌ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. 

యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్‌స్కేపింగ్‌లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.

వంద కోట్ల అగవె ప్రాజెక్టు
అగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్‌ ఇంటర్నేషనల్‌’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్‌ సంకల్పం తీసుకుంది. ద బిలియన్‌ అగవె ప్రాజెక్ట్‌లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. 

అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.

సరికొత్త తోటల నమూనా 
అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్‌ ఇంటర్నేషనల్‌ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి.  

అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్‌ కట్టర్‌ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్‌ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. 

ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్‌ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్‌ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.

ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి
మన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. 

మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. 

పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. 

అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. 

‘అగవె’నే ఎందుకు?
భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.

  • అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. 

  • అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. 

  • అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. 

ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!
అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. 

భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్‌ డయాక్సయిడ్‌ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్‌ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది.  
పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

(చదవండి: beat the heat ఇండోర్‌ ప్లాంట్స్‌తో ఎండకు చెక్‌)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sagubadi
plants
project
environment
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

సముద్రం కింద, పర్వతాల మధ్య..

సముద్రం కింద, పర్వతాల మధ్య..

బాబూ, పవన్‌ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!

బాబూ, పవన్‌ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.