Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

Funday: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?

Family Sakshi User Sakshi Sakshi Time Jan 21, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
saim-kalam.jpg

సాగర్‌ ఒక మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్‌ టార్గెట్స్‌ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.

ప్రమోషన్‌ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్‌ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్‌లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్‌ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు. 

ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉన్న సాగర్‌ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది.

నిరంతరం నెగటివ్‌ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్‌ పర్సిస్టెంట్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం.

అనేక కారణాలు...

మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్‌ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌లానే వివిధ కారణాలుంటాయి. 

♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్‌మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ను నియంత్రించే సెరటోనిన్‌ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి.

♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి.

♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. 

నివారణ లేదు, నియంత్రణే మార్గం...

పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు...

♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి

♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి

♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి

♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు

♦ తమను తాము  ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్‌ హెల్ప్‌ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి

♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి

♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్‌ను కలసి చికిత్స పొందాలి

♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. 

నిరాశ, నిస్సహాయత...

పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే... 

♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత

♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం.

♦ అలసట, శక్తి లేకపోవడం.

♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం

♦ ఫోకస్‌ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది.

♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు.

♦ చిరాకు, అసహనం లేదా కోపం.

♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం.

♦ గతం గురించి చింత, అపరాధ భావాలు

♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం.

♦ నిద్ర సమస్యలు.  

సైకాలజిస్ట్‌ విశేష్‌, psy.vishesh@gmail.com                  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
psychology
Depression
Disorder
Funday
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.