Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?

Family Sakshi User Sakshi Sakshi Time Apr 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
abrakadabra-1.jpg

పిల్లలూ! మీరేదైనా మ్యాజిక్‌ షోకి వెళ్లినప్పుడు స్టేజీ మీద ఉన్న మెజీషియన్‌ తప్పకుండా ‘అబ్రకదబ్ర’ అనే మాట వాడటం వినే ఉంటారు. చాలాసార్లు మ్యాజిక్‌ షోలలో ఈ పదం వాడుతుంటారు. దీనికి అర్థమేమిటో, ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా? ఈ పదం ఎప్పుడు, ఎవరు, ఎలా పుట్టించారో కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ రెండో శతాబ్దానికి చెందిన రోమన్‌ వైద్యుడు సెరెన్‌ సమ్మోనికస్‌ రాసిన గ్రంథాల్లో ఈ మాట ఉంది. కాబట్టి ఇది చాలా పురాతనమైన మాట అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. జ్వరం తగ్గిపోవడానికి చిట్కాగా ఆయన తన గ్రంథంలో ‘అబ్రకదబ్ర’ అనే పదాన్ని వాడారు. 

ఈ పదానికి హిబ్రూ భాషలో ‘నేను చెప్పినట్లే సృష్టిస్తాను’, అరేబిక్‌ భాషలో ‘నా మాట ప్రకారం సృష్టి జరుగుతుంది’ అనే అర్థాలున్నాయంటారు. హిబ్రూ భాషలోని ‘హ బ్రఖా దబరా’ (ఆశ్వీరాదం  పొందినవారు) అనే వాక్యం నుంచి ఈ పదం వచ్చి ఉంటుందని డాన్‌ స్కీమర్‌ అనే చరిత్రకారుడు అంచనా వేశారు. ఇవన్నీ అంచనాలే తప్ప ‘అబ్రకదబ్ర’ అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ పదానికి చాలా శక్తి ఉందని, ఇది పఠిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని రకరకాలుగా ప్రచారం చేశారు. అనంతరం 1800 నుంచి మెజీషియన్లు దీన్ని తమ షోల్లో వాడటం మొదలుపెట్టారు. ఏదైనా ఒక మ్యాజిక్‌ ట్రిక్‌ చేసే ముందు ఈ పదాన్ని వాడి, ఆ ట్రిక్‌ చేయడం ద్వారా ఈ పదానికి మహత్వం ఉందని అందరూ అనుకునేవారు. నేటికీ అది కొనసాగుతోంది. 
 


తెలుగువారి కీర్తిపతాకం..  భోగరాజు పట్టాభి సీతారామయ్య  
పిల్లలూ! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం. అటువంటి  ప్రాంతంలో పుట్టిన ఓ మహనీయుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయనే భోగరాజు పట్టాభి సీతారామయ్య. 

సీతారామయ్య 1880 నవంబర్‌ 24 న కృష్ణా జిల్లా గుండుగొలను అనే ఊరిలో జన్మించారు. చిన్ననాటి నుంచి వైద్యుడిగా మారాలన్న ఆలోచనతో మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో చేరి ఎంబీసీఎం డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మచిలీపట్నంలో వైద్యుడిగా సేవలందించడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తన పని వదిలేసి స్వాతంత్రో ద్యమంలో చేరారు. 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించారు. అందుకే ఆంధ్రాబ్యాంకు ప్రధాన భవనానికి ‘పట్టాభి భవన్‌’ అని పేరు పెట్టారు. దీంతోపాటు ఆయన ఆంధ్రా ఇన్సూరెన్స్‌సంస్థను కూడా స్థాపించారు. 

కాంగ్రెస్‌  పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన సీతారామయ్య మహాత్మాగాంధీకి సన్నిహితుడిగా మారారు. 1935లో ‘ది హిస్టరీ ఆఫ్‌ ది కాంగ్రెస్‌’ పుస్తకం రాశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో  పాల్గొన్న ఆయన్ని మూడేళ్లపాటు అహ్మద్‌ నగర్‌ జైల్లో ఉంచారు. అక్కడున్నరోజుల్లో ‘ఫెదర్స్‌ అండ్‌ స్టోన్స్‌’ పేరుతో తన జైలు అనుభవాలు రాశారు. ఆపై ‘గాంధీ అండ్‌ గాంధీయిజం’ పుస్తకాన్ని రాశారు.  కాంగ్రెస్‌  పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం తొలి గవర్నర్‌గా వ్యవహరించారు. తెలుగువారి కీర్తిపతాకంగా నిలిచారు. దేశానికి నలేని సేవలందించిన ఆయన 1959  డిసెంబర్‌ 17న మరణించారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
magician
meaning
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Gayatri Mantra : విశిష్టత ఏంటి?  అర్థం తెలుసుకుందాం!

Gayatri Mantra : విశిష్టత ఏంటి? అర్థం తెలుసుకుందాం!

ఆధ్యాత్మికథ  దేని విలువ దానిదే!

ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!

ఆదర్శం అంటే..!

ఆదర్శం అంటే..!

తాత్త్వికథ: జీవిత పరమార్థం

తాత్త్వికథ: జీవిత పరమార్థం

ఖో..ఖో :  ఇంట్రస్టింగ్‌ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?

ఖో..ఖో : ఇంట్రస్టింగ్‌ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?

అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర

అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.