Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

'డైనోసార్ ప్రిన్సెస్': ఎవరీ ఆలియా సుల్తాన్‌ బాబీ?

Family Sakshi User Sakshi Sakshi Time Mar 6, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Gujarat.jpg

డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్‌ పార్క్‌ వంటి హాలీవుడ్‌ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్‌ పార్క్‌ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..?

గుజరాత్‌లోని బాలాసినోర్‌కు చెందిన  ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్‌ పార్క్‌ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్‌గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్‌గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్‌కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్‌ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్‌ గుడ్లను చూశారు.

ప్రఖ్యాత జియాలజిస్ట్‌ అశోక్‌ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్‌ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్‌ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్‌ బస చేసే హెరిటేజ్ హోటల్‌గా మారింది.

శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్‌ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్‌గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్‌ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్‌లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్‌ల గురించి సవివరంగా తెలిపేలా  స్వయంగా ఆమె ఓ గైడ్‌గా మారి వివరించేది. అ

ఆమె డైనోసార్‌ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్‌ యవరాణి(డైనోసార్‌ ప్రిన్సెస్‌ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది  భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్‌ నటి పర్వీన్‌ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో డైనోసార్‌ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్‌ శిలాజ పార్క్‌ ప్రత్యేకత. 

View this post on Instagram

A post shared by Dinosaur Musuem (@dinosaur__balasinor)

(చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్‌ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gujarat
dinosaurs
fossils
princess
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

రాజభవనం టూ జైలు.. యువరాణి కుమారుడికి నాలుగేళ్ల శిక్ష

రాజభవనం టూ జైలు.. యువరాణి కుమారుడికి నాలుగేళ్ల శిక్ష

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

రాజకుమారి మరణం.. థాయ్‌ సింహాసనంపై బిగ్‌ సస్పెన్స్‌

రాజకుమారి మరణం.. థాయ్‌ సింహాసనంపై బిగ్‌ సస్పెన్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.