Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మీకూ ప్రోటీన్‌ కావాలండోయ్‌!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
666.jpg

ఎంత అవసరమో అన్న అవగాహనా లేదు 

40% మంది మాత్రమే సమతుల ఆహారం 

ప్రోటీన్‌ లేమి సమస్య పట్టణ ప్రజల్లోనే ఎక్కువ 

చవకగా దొరికితే తీసుకుంటామన్న అత్యధికులు 

ఈ లోపంవల్ల ముప్పు తప్పదంటున్న నిపుణులు 

కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

ప్రోటీన్‌.. కణాల పునరుద్ధరణకు ఈ సూక్ష్మపోషకం ప్రధాన వనరు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్‌ సరఫరాలో (హిమోగ్లోబిన్‌ ద్వారా) కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రోటీన్‌ పోషించే పాత్ర గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ప్రోటీన్లపై అవగాహన, వినియోగంపై కంట్రీ డిలైట్‌ భాగస్వామ్యంతో ‘కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌’దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 25 మెట్రో, నగరాలకు చెందిన 2.07 లక్షల మంది ఇందులో పాలుపంచుకున్నారు. నగరాల్లో నివసించే భారతీయులలో దాదాపు 60 శాతం మంది ప్రతిరోజూ ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదని ఈ సర్వేలో తేలింది. జనంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్నా, విభిన్న ఆహారోత్పత్తులు లభిస్తున్నా ఈ పరిస్థితి నెలకొంది. ధర అందుబాటులో లేకపోవడమే పెద్ద అడ్డంకి అన్నది అత్యధికుల మాట. చవక ప్రోటీన్‌ ప్రత్యామ్నాయాలు లభిస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని 71% మంది తెలిపారు.

సమతుల ఆహారమని.. 
సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో 10 మందిలో నలుగురు మాత్రమే తమ రోజువారీ భోజనంలో కొవ్వు తక్కువగా ఉండే మాంసం, పప్పులు, గుడ్లు, పాలు, పనీర్, చేపలు, గింజలు వంటి ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్, ముందస్తు వ్యాధి నివారణ గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ ప్రోటీన్‌ తీసుకోవడంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. దాదాపు నాలుగింట మూడొంతుల మందికి రోజూ ఎంత ప్రోటీన్‌ అవసరమో తెలియదు. 85% మంది రోజూ తమకు ఎంత ప్రోటీన్‌ అందుతుందో కొలవడం లేదు. ఎంత అవసరమో అన్న విషయం అవగాహన లేకపోవడంతో ప్రోటీన్‌ తక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు చాలా మంది తాము సమతుల ఆహారం స్వీకరిస్తున్నామని నమ్ముతున్నారు.  

పొంచి ఉన్న ముప్పు.. 
సగం మందికి పైగా ప్రజలు తమకు ఎదురయ్యే నీరసం, జుట్టు రాలడం, తరచుగా అనారోగ్యానికి గురవ్వడం వంటి సమస్యలు ప్రోటీన్‌ లోపం వల్ల వస్తున్నాయని గుర్తించడం లేదు. ప్రోటీన్‌ లేమితో కండరాల క్షీణత మాత్రమే కాకుండా జీవక్రియ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ముసలితనాన్ని గడపడానికి, వ్యాధులను నిరోధించడానికి ప్రోటీన్‌ ఒక పునాది వంటిదని అంటున్నారు.

ఐసీఎంఆర్‌ ప్రకారం.. 
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనాల ప్రకారం భారత్‌లో దాదాపు అన్ని రకాల ఆదాయ వర్గాలు తగినంత ప్రోటీన్‌ తీసుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ భారత్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.66–0.83 గ్రాముల ప్రోటీన్‌ తీసుకోవాలి.

పోషక వనరు ఇలా.. 
∙ప్రోటీన్‌ ఫుడ్‌ అనేది శరీరానికి అత్యవసరమైన పోషకాలు కలిగిన వనరులు.  ∙కండరాలు, చర్మం, ఎముకల వంటి శరీర కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను ప్రోటీన్స్‌ అందిస్తాయి.  ∙జీవక్రియ పనితీరు, రోగనిరోధక శక్తి, హార్మోన్ల ఉత్పత్తి, ఆకలిని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.  

  • అవగాహన లోపం.. 
    ప్రోటీన్‌ అంటే కేవలం బాడీ బిల్డింగ్‌ కోసమే అని చాలా మంది భావిస్తారు. కానీ రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యం, వయసు పెరిగే కొద్దీ కండరాలు క్షీణించకుండా ఉండటానికి ప్రోటీన్‌ ఎంతో అవసరం. 
  • ఒక చిన్న కప్పు నిండా పప్పు లేదా ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కిలో శరీర బరువుకు 0.83 గ్రాముల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఏమాత్రం సరిపోదు. 
  • అన్నం, చపాతీలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు అందక అంతర్గతంగా శరీరం బలహీనపడుతుంది.
     
  • లోపిస్తే సమస్యలే.. 
    రోగనిరోధక శక్తి బలహీనపడటం, తీవ్రమైన అలసట కలుగుతాయి.  
  • జుట్టు రాలడం, పెళుసుగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.  
  • ప్రోటీన్‌ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీర కణజాలాలలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కలిగే వాపు (ఎడెమా) వస్తుంది.  
  • గాయాలు త్వరగా మానవు. మూడ్‌ స్వింగ్స్, మానసిక స్థితిలో మార్పులు రావొచ్చు.  
  • ఫ్యాటీ లివర్, పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలూ ఎదురుపడవచ్చు.  
ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Protein
Health
platform
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..

మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.