Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం
ADVERTISEMENT 

పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం

Editorial Sakshi User Sakshi Sakshi Time Aug 16, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sc.jpg

ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది. 

కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. 

ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్‌పోర్టు ఉంది. కానీ ఆ పాస్‌పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్‌ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్‌’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా,  వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది. 

నిరుడు జూలై నుంచి డిసెంబర్‌ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్‌ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది. 

ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్‌ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు. 

సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్‌ క్రమ సంఖ్య టైప్‌ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్‌ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?

‘సర్‌’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్‌లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్‌ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి. 

ఈసీ నిర్వాకంతో రాగల బిహార్‌ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్‌తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి? 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Central Election Commission
Supreme court of India
Bihar
Assembly election
voter list
revision
Editorial.
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.