Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. ధరల రోగానికి ఇదా చికిత్స?!
ADVERTISEMENT

ధరల రోగానికి ఇదా చికిత్స?!

Editorial Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 12:34 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
med_20d.jpg

నియంత్రించాల్సిన వ్యవస్థలు నోరుమూసుకుంటే, పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టుంటే జరిగేదేమిటో ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధికి వాడే ఔషధాల ధరలు చుక్కలనంటడం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమూ, జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం మొన్న మంగళవారం తీవ్రంగా దుయ్యబట్టాక ఆ వెంటనేకొంత కదలిక వచ్చిన జాడలు కనబడ్డాయి. 

అంతక్రితమే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా ఎంపికచేసిన 137 ఔషధాల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. వచ్చే నెల 9నుంచి అమల్లోకొచ్చేలా వీటి ధరలు తగ్గించామని ఉత్పత్తిదారులు ప్రకటించారు. మంచిదే. అయితే మొత్తం 543 కేన్సర్‌ ఔషధ రకాల్లో వీటి సంఖ్య ఏపాటి? చావు కబురు చల్లగా చెప్పినట్టు పేటెంటు, లైసెన్సు, ఇతర రకాల పరిరక్షణ వ్యవస్థల పరిధిలోకొచ్చే ఔషధాలకు మాత్రం ఈతగ్గింపు వర్తించదంటున్నారు ఉత్పత్తిదారులు.

ప్రజలందరి మేలూ కోరే ఆర్థిక వ్యవస్థ లేనిచోట నిరుద్యోగం, పేదరికం, అజ్ఞానం, అనారోగ్యంవంటి సమస్త రుగ్మతలూ ముసురుకుంటాయని కెనడాకు చెందిన ప్రజా వైద్యుడు డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ చెప్పి దశాబ్దాలు దాటుతోంది. దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ ఆచరణ ద్వారా ఆయన చెప్పింది నూరుశాతం నిజమని నిరూపి స్తున్నాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులతోపాటు పలు ఇతర కేన్సర్లకు వాడే మెర్క్‌కంపెనీ ఔషధం వంద మిల్లీగ్రాముల టీకా ధర రూ. 2.16 లక్షలు. ఇంత ధర వెచ్చించటం సాధారణ రోగులకు సాధ్యమేనా? 21 మాత్రలుగా ఉండే ఇమ్యూనోథెరపీ ఔషధం200 మిల్లీగ్రాముల ధర రూ. 24,435. ఈ రెండు రకాల ఔషధాలూ జాబితాలో లేవు.

ఇవేకాదు... రూ. 10 లక్షల ఖరీదుచేసే మరో ఔషధం కూడా జాబితాలో గల్లంతయింది! అలాగే చాలావాటి ధరలు స్వల్పంగా... అంటే రూ. 100లోపే తగ్గాయి. రొమ్ము, ప్రొస్టేట్‌ తదితర కేన్సర్లకు వినియోగించే నాలుగైదు రకాల ఔషధాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు కీమోథెరపీలో వాడే ఔషధం ధర రూ. 80,071 నుంచి రూ. 7,150కి, రొమ్ము కేన్సర్‌కు వాడే ఔషధం ధర రూ. 40,421 నుంచి రూ. 2,720కి, బహుళ కేన్సర్లకు వాడే ఔషధం ధర రూ. 69,852 నుంచి రూ. 13,512కు తగ్గాయి. 

అసలు ఎంఆర్‌పీపై నియంత్రణ  సరిపోతుందనుకోవటమే లోపభూయిష్టం.తగ్గించామని ఘనంగా చెప్పుకున్నంతసేపు పట్టదు అవి పెరగటానికి. ముడి సరుకుల ధరలు పెరిగితే అవి పైపైకి పోతాయి. చాలా రకాల ఔషధాలకు లక్షల రూపాయల ధర పెట్టడం వెనక అవి ప్రాణరక్షణకు ప్రభావవంతంగా తోడ్పడటంతప్ప మరేవిధమైన హేతుబద్ధతా లేదు. ఉత్పత్తిదారుల దగ్గర ధరను నియంత్రిస్తే వేరు. ఉదాహరణకు ఒక ఔషధ తయారీకయ్యే వ్యయానికి ఉత్పత్తిదారులు 42.8 శాతం అదనంగా వేసుకుని స్టాకిస్టులకు విక్రయిస్తారు. రోగులకెళ్లేలోగా మరిన్ని అంచెలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రులే నేరుగా కొని విక్రయిస్తాయి. ఈ క్రమంలో ప్రతిచోటా అదనపు లాభం వేసుకుంటూపోతారు. ఎంఆర్‌పీపై కేంద్రీకరిస్తే ఈ లాభార్జన స్వల్పంగా తగ్గుతుంది. ఆస్పత్రులైతే మందులపై ‘కోల్పోయిన’ దాన్ని గది అద్దె పెంచటంద్వారానో, మరో రకంగానో వసూలు చేస్తాయి.

గతంతో పోలిస్తే కేన్సర్‌ మహమ్మారి విస్తృతి పెరిగింది. గ్రామాలు, నగరాలన్న తేడా లేకుండా అందరినీ కాటేస్తోంది. కారణాలు అందరికీ తెలుసు. సాగులో ఎరువులవాడకం, అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు విచక్షణారహితంగా ఇంజెక్షన్లివ్వటం, వాతావరణ కాలుష్యం, నదులు, భూగర్భ జలాల కాలుష్యం, ప్రమాదకరమైన ఆహార విక్రయాలు... ఇవన్నీ కేన్సర్‌ కారకాలు. సారాంశంలో ప్రభుత్వ విధానాలు కావొచ్చు... వాటి నిర్వా్యపకత కావొచ్చు... ఈ ప్రాణాంతక వ్యాధికి మూలం. ప్రత్యక్షంగాలేదా పరోక్షంగా తామే ఈ మరణమృదంగానికి కారణమవుతూ... కనీసం ఔషధాల ధరలైనా సరిగా నియంత్రించలేనప్పుడు ప్రభుత్వాలుండి ఏం ప్రయోజనం? అందుకేకంటితుడుపు చర్యలు మానుకుని వాస్తవంగా జనానికి లబ్ధి చేకూరే విధానాలు అమల్లోకి తీసుకురావాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Medicine
price
Cancer
NPPA
Supreme court of India
Editorial.
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి

దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి

దేశంలోనే తొలిసారి.. మొదటి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ సెంటర్

దేశంలోనే తొలిసారి.. మొదటి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ సెంటర్

సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఎస్‌ఈసీ లెక్కచేయడంలేదు

సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఎస్‌ఈసీ లెక్కచేయడంలేదు

నేడు సుప్రీంకోర్టుకు వైఎస్సార్‌సీపీ

నేడు సుప్రీంకోర్టుకు వైఎస్సార్‌సీపీ

మరిన్ని వార్తలు

గృహ నిర్బంధంలో ప్రజాస్వామ్యం!

గృహ నిర్బంధంలో ప్రజాస్వామ్యం!

స్వోత్కర్షలు సరే, సాయం ఏది?

స్వోత్కర్షలు సరే, సాయం ఏది?

ఎవరి రక్షణకు ఈ చట్టం?!

ఎవరి రక్షణకు ఈ చట్టం?!

యువకెరటం జయకేతనం!

యువకెరటం జయకేతనం!

నెతన్యాహూకు అగ్నిపరీక్ష!

నెతన్యాహూకు అగ్నిపరీక్ష!

స్థలకాల సందిగ్ధంలో...

స్థలకాల సందిగ్ధంలో...

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft