Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?

Business Sakshi User Sakshi Sakshi Time Dec 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
termm.jpg

ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.

నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.

ఏది పెట్టుబడి? ఏది రక్షణ?

చాలామంది ఇన్సూరెన్స్‌ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..

ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.

టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.

‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే

‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్‌లో మాత్రమే ఉంటుంది.

ప్రీమియం రిటర్న్‌ రావాలంటే..

డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).

టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

  • కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.

  • పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.

  • నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.

  • 25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.

  • ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.

టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Term Insurance
Term Policy
insurance
premium
Youth Finance
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

ఫిన్‌టెక్‌ సేవల్లోకి ఎల్‌ఐసీ

ఫిన్‌టెక్‌ సేవల్లోకి ఎల్‌ఐసీ

విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌

విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌

సరిగా కొంటేనే.. బంగారం!

సరిగా కొంటేనే.. బంగారం!

సిప్‌ ఓకే... తప్పు చేయొద్దు! 

సిప్‌ ఓకే... తప్పు చేయొద్దు! 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.