Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

వారెన్‌ బఫెట్‌ ప్రకారం.. ఆ 5 తప్పులివే...

Business Sakshi User Sakshi Sakshi Time Jul 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
warren.jpg

అమెరికాకు చెందిన వారెన్‌ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్‌ బఫెట్‌ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు  ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా  చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...

కొత్త కారు...పెద్ద వృధా..
చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్‌ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే  విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ  60% వరకు  కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్‌ 2014 మోడల్‌ క్యాడిల్లాక్‌ ఎక్స్‌టిఎస్‌ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్‌ మోటార్స్‌ వాళ్లు భారీ డిస్కౌంట్‌ ధరపై ఇస్తేనే  కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.

క్రెడిట్‌ కార్డ్‌ ఓ వల...
బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్‌ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్‌ కార్డ్‌ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని  అంటున్నారు బఫెట్‌..  దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్‌ కార్డ్‌ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.

లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..
జూదం, లాటరీలను ‘‘మ్యాథ్‌ ట్యాక్స్‌’’ అని పేర్కొంటారు బఫెట్,  అంటే మ్యాథమేటిక్స్, లాజిక్‌ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.

ఇల్లు...అవసరమా? విజయమా?
అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్‌. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన  ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్‌టెనెన్స్‌ అన్నీ డబుల్‌ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.

అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దు
మనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్‌ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్‌.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.  అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్‌ని ఎప్పటికీ మరచిపోవద్దు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Warren Buffett
mistakes
rich
Satya Stories
Personal Finance
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

సొంతిల్లా... అద్దె ఇల్లా?

సొంతిల్లా... అద్దె ఇల్లా?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.