Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్‌ నిర్ణయం

Business Sakshi User Sakshi Sakshi Time Sep 27, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
real.jpg

మెట్రో నగరాల్లోని కార్యాలయ స్థలాలకు డిమాండ్‌

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు

దేశంలో ఆఫీసు స్పేస్‌ లీజులలో 40 శాతం వాటా జీసీసీలదే..

నగరంలో 52 లక్షల చ.అ. లీజుకు తీసుకున్న జీసీసీలు

పీఠం ఎక్కిన తొలి రోజు నుంచీ భారత్‌పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా నిర్ణయం.. దేశీయ స్థిరాస్తి రంగానికి ఊతమివ్వనుంది. ప్రత్యేకించి కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను కల్పించనుంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా రుసుముల పెంపు నిర్ణయంతో.. దేశీయంగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు అపార అవకాశాలు ఏర్పడతాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే బహుళ జాతి సంస్థల జీసీసీలకు హాట్‌ ఫేవరేట్‌ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లకు ఇదొక వరంగా మారనుంది. అందుబాటులో అద్దెలు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్‌ జీసీసీలకు హబ్‌గా మారే అవకాశాలున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

జీసీసీలకు ఇండియా కేంద్రంగా అభివృద్ధి

చెందడంతో బహుళ జాతి కంపెనీలు ఇక దేశీయంగానే జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్నాలజీ హబ్‌ మెట్రోల్లోని ఆఫీసు స్పేస్‌లకు ఆదరణ ఏర్పడనుంది. ప్రస్తుతం దేశంలో 1700లకు పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 64 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా ఉంది. 2030 నాటికి 2,400 జీసీసీలకు, 25–30 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌కు విస్తరిస్తుందని కొల్లియర్స్‌ నివేదిక అంచనా వేసింది.

ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకత..

జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్‌షోర్‌ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్‌లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్‌ఎస్‌ఐకి, హైదరాబాద్‌ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్‌కు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ఈ–కామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశంలోని జీసీసీలు కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్‌ లెరి్నంగ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.

అమెరికా కంపెనీలే ఎక్కువ..

భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్‌ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్‌ –500 కంపెనీలు, గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో యూకే, యూరప్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఆఫ్రికా(ఈఎంఈఏ), ఆసియా పసిఫిక్‌ (ఏపీఏసీ) దేశాల జీసీసీలు కూడా ఇండియాలో జీసీసీలను విస్తరిస్తున్నాయి. 2025లో జరిగిన 2.8 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలలో జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్‌ వంటి ఏపీఏసీ దేశాల వాటా 10 శాతంగా ఉంది.

జీసీసీ స్పేస్‌ 10 కోట్ల చ.అ.

నాలుగేళ్లలో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాలలో 10 కోట్ల చ.అ. స్థలాలను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. ఇది మొత్తం ఆఫీసు స్పేస్‌ డిమాండ్‌లో 36 శాతం. జీసీసీ లీజింగ్‌లలో టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 37 శాతం లావాదేవీలలో ఐటీ రంగం తొలి స్థానంలో నిలవగా.. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్, తయారీ రంగాలు 40 శాతం స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అలాగే 2026లో 7–7.5 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలలో 2.9–3.2 కోట్ల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకుంటాయని ‘కొల్లియర్స్‌’ అంచనా వేసింది. అలాగే 2027లో 7.5–8.5 కోట్ల కార్యాలయ స్థల లావాదేవీలలో జీసీసీల వాటా 3.2–3.4 కోట్లతో, ఏటా 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.

హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు

బహుళ జాతి సంస్థల జీసీసీలకు దక్షిణాది నగరాలు హాట్‌ ఫేవరెట్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు నగరాలు బహుళ జాతి సంస్థల జీసీసీలను ఆకర్షించడంలో తీవ్రపోటీపడుతున్నాయి. 2021–25 మధ్యకాలంలో ఈ రెండు నగరాలు మొత్తం జీసీసీ డిమాండ్‌లో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.

2021తో పోలిస్తే 2025లో చెన్నైలో జీసీసీ లీజులు 5.3 రెట్లు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్‌ 2021 నుంచి జీసీసీ లీజింగ్‌లలో 60 శాతం వాటాను నమోదు చేస్తున్నాయి. బెంగళూరులోని ఓఆర్‌ఆర్, హైదరాబాద్‌లోని సెకండరీ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌(ఎస్‌బీడీ) ప్రాంతాలు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఫార్చ్యూన్‌–500 కంపెనీలు ఈ కారిడార్లలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021 నుంచి దేశంలోని జీసీసీ లీజులలో ఈ కారిడార్ల వాటా ఏకంగా 37 శాతంగా ఉంది.

నగరంలో 355 జీసీసీలు..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 355కు పైగా జీసీసీ సెంటర్లున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సౌత్‌ కొరియా దేశాలకు చెందిన జీసీసీలు నగరంలో కొలువుదీరాయి. మెక్‌ డొనాల్డ్స్, వాన్‌గార్డ్, సిటిజెన్‌ బ్యాంక్, హీనెకెన్, బారీకేల్‌బాట్, డై–ఇచి, హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2021లో నగరంలో 37 లక్షల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకోగా.. 2025 నాటికి 52 చ.అ.లకు చేరాయి.

5.09 కోట్ల ఆఫీసు స్పేస్‌..

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్యకాలంలో 5.09 కోట్ల చ.అ. గ్రేడ్‌–ఏ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 4.73 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 7 నగరాలలో కొత్తగా 4.14 కోట్ల గ్రేడ్‌–ఏ కార్యాలయ స్థలం సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంలో సప్లయి అయిన 3.78 కోట్ల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.

ఇదీ చదవండి: రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
real estate
Donald trump
H1B Visa
office space market
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.