Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

టిక్‌టాక్‌ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!

Business Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tiktok01.jpg

అమెరికాలో టిక్‌టాక్‌ తన సేవలను పునరుద్ధరించిందని, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇందుకు కారణమని పేర్కొంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ తాత్కాలికంగా నిలిచిపోతుందని అందరూ భావించారు. ఇది మిలియన్ల మంది అమెరికన్ వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అనుకున్నారు. అయితే, ట్రంప్ జోక్యంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించడంతో యూజర్లకు ఊరట లభించింది.

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. మిలియన్ల మంది అమెరికన్లు ఈ యాప్‌పై ఆధారపడ్డారని ఆయన నొక్కిచెప్పారు. ఈ యాప్‌ యూఎస్‌లో కొనసాగేలా, ఇది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన స్పష్టతను అందించింది. దాంతోపాటు టిక్‌టాక్‌ జరిమానాలు ఎదుర్కోకుండా తాత్కాలికంగా కాపాడినట్లయింది.

అసలు వివాదం ఏమిటి?

చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్‌ అమెరికా ఉన్నత​ న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్‌ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.

భద్రతపై ఆందోళనలు

అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్‌ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్‌ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్‌ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్‌టాక్‌ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది.

ఇదీ చదవండి: ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం

భవిష్యత్తుపై ప్రశ్నలు

టిక్‌టాక్‌కు తక్షణ సంక్షోభం తప్పినప్పటికీ, అమెరికాలో కంపెనీ భవిష్యత్తుపై ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికాలో తన కార్యకలాపాలు సాగించాలంటే మాత్రం ఏదైనా యూఎస్‌ కంపెనీతో చైనీస్ మాతృసంస్థ బైట్ డాన్స్‌ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అందులో అమెరికన్ ఇన్వెస్టర్లు కనీసం 50 శాతం వాటా కలిగి ఉండాలి. అమెరికాలో ఈ యాప్ కార్యకలాపాలు కొనసాగేలా చూస్తూనే జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం సవాలుగా మారనుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
TikTok
Donald trump
restore
Revival Period
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.