Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం

Business Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ityaly12.jpg

5 లక్షల మందికి వీసా ఇచ్చేలా ప్రణాళికలు

ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య  యురోపియన్‌ యూనియన్‌యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.

వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలు

వచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్‌ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్‌ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్‌ పర్మిట్లు జారీ చేయనున్నారు.

  • 2026: 164,850 వర్క్ పర్మిట్లు

  • 2027: 166,350 వర్క్ పర్మిట్లు

  • 2028: 166,350 వర్క్ పర్మిట్లు

సిబ్బంది అవసరమయ్యే రంగాలు..

దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.

  • వ్యవసాయం

  • నిర్మాణ రంగం

  • ఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)

  • టూరిజం

  • తయారీ రంగం

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తో సహా డిజిటల్ సేవల రంగం.

పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఎందుకు ఇలా  చేస్తోందంటే..

లేబర్ కొరత

ఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.

  • రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు

  • 45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.

  • ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.

  • డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.

జనాభా సంక్షోభం

ఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

భారత్‌ ఎలా అర్థం చేసుకోవాలంటే..

వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్‌లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..

  • హెల్త్‌కేర్‌: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉంది.

  • ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.

  • హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.

  • డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.

ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.

👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్‌ చేయండి

వీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలు

  • జాబ్ ఆఫర్ లెటర్

  • ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్‌ పర్మిట్‌)

  • వీసా దరఖాస్తు ఫారం

  • పాస్‌పోర్ట్‌

  • ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.

  • ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్‌మెంట్‌ లేదా స్పాన్సర్ లెటర్‌ ఉండవచ్చు.

  • హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.

ఇటలీలో డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలు

  • స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)

  • ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు

  • మెకానికల్ హెల్పర్లు

  • సేఫ్టీ ఆఫీసర్లు

  • హెల్త్ కేర్‌: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లు

  • డిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.

  • టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.

ఇదీ చదవండి: టాటా మోటార్స్‌ నుంచి మినీ ట్రక్‌లు.. ధర ఎంతంటే..

వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్‌..

  • బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.

  • త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.

  • రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్‌లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Italy
Visa
Work permit visa
work permit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!

నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!

‘చెక్క’నైన చాక్లెట్‌

‘చెక్క’నైన చాక్లెట్‌

జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..

జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..

నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?

నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.