Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

పాత ఫోన్లకే ఓటు

Business Sakshi User Sakshi Sakshi Time Jun 3, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
phone01.jpg

కొత్త ఫోన్‌ కొనుగోలుకు కొంతకాలం బ్రేకు

పండుగ సీజన్‌ విక్రయాల్లో 30% వరకు తగ్గే అవకాశం  

ట్రాకిన్‌ టెక్, టెకార్క్‌ సర్వేలో ఆసక్తికర అంశాలు 

స్మార్ట్‌ఫోన్‌ల ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. ధరలు దిగివచ్చే వరకు సగానికి పైగా మంది కొనుగోలును వాయిదా వేయగా, కొందరు సెకండ్‌హ్యాండ్‌ ఫోన్ల వైపు మళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిస్థితి కొనసాగితే పండుగ సీజన్‌లో (జూలై–డిసెంబర్‌) దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 30 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ట్రాకిన్‌ టెక్, టెకార్క్‌ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్ధంలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లలో 54% డిమాండ్‌ క్షీణించవచ్చు.

దేశవ్యాప్తంగా జూలై నుంచి డిసెంబర్‌ మధ్య స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని యోచిస్తున్న 5,958 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది ధరలు తగ్గే వరకు కొనుగోలును వాయిదా వేస్తామని, మరో 6 శాతం మంది సెకండ్‌హ్యాండ్‌ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుత ధరల ధోరణి కొనసాగితే ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 115–120 మిలియన్‌ యూనిట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 136–138 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది.  

మెమరీ చిప్‌ల ధరలే ప్రధాన కారణం

న్యాండ్‌ ఫ్లాష్, డీఆర్‌ఏఎం మెమరీ చిప్‌ల గ్లోబల్‌ ధరలు పెరగడం స్మార్ట్‌ ఫోన్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని సర్వే పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్, వర్కింగ్‌ మెమరీ కోసం ఉపయోగించే ఈ చిప్‌ల ఖర్చు పెరగడంతో తయారీ వ్యయాలు అధికమయ్యాయి. ప్రత్యేకించి రూ.20 వేలలోపు ధరల విభాగంలో ఫోన్ల ధరలు సగటున 8–12% వరకు పె రిగాయి. ఈ విభాగంలో మెమరీ చిప్‌ల ఖర్చు మొత్తం తయారీ వ్యయంలో దాదాపు 40% వరకు ఉంటుంది.

ఊపందుకోనున్న ప్రీ–ఓన్డ్‌ మార్కెట్‌

ధరల పెరుగుదల ప్రభావంతో ప్రీ–ఓన్డ్, రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు గణనీయమైన ఆదరణ లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సెకండ్‌హ్యాండ్‌ ఫోన్ల వైపు మళ్లే 6% మంది వినియోగదారులు అదనంగా 60–70 లక్షల యూనిట్ల డిమాండ్‌ను సృష్టించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం 23–25 మిలియన్‌ యూనిట్ల స్థాయిలో ఉన్న ఈ మార్కెట్‌ ఏడాది 30–32 మిలియన్‌ యూనిట్లకు పెరగవచ్చని టెకార్క్‌ వ్యవస్థాపకుడు ఫైసల్‌ కవూసా తెలిపారు.

ఫైనాన్స్‌ సదుపాయమూ సవాళ్లే..

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లకు ఫైనాన్స్‌ సదుపాయాలు కూడా కఠినతరమవుతున్నాయని నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్లు పెరగకపోయినా గతంలో రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్‌లు పెరగడం వల్ల రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కఠినతర విధానాలు అమలు చేస్తున్నాయి. అసంఘటిత వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే పలువురికి సరైన క్రెడిట్‌ స్కోర్‌ లేకపోవడంతో రుణ లభ్యత కష్టమవుతోంది. ‘‘భారతీయ వినియోగదారులు మెరుగైన స్మార్ట్‌ఫోన్‌లను కోరుకుంటున్నారు. అయితే అందుబాటు ధర ఉండాలని ఆశిస్తున్నారు. ధరలు మరింత పెరిగితే కొనుగోళ్లు వాయిదా వేయడం, సర్దుకుపోవడం, ఫైనాన్స్‌ ఆశ్రయించడం, సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల వైపు మళ్లుతున్నారు. వినియోగదారుల గురించి అవగాహన ఉన్న స్థానిక రిటైలర్ల ద్వారా వినూత్న ఫైనాన్సింగ్‌ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ట్రాకిన్‌ టెక్‌ వ్యవస్థాపకుడు అరుణ్‌ ప్రభుదేశాయ్‌ పేర్కొన్నారు.  

ధరల పెరుగుదలకు 3 ప్రధాన కారణాలు

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 2025 జనవరి నుంచి 2026 మే వరకు ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించిందని అధ్యయనం పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ) సంస్థల భారీ పెట్టుబడుల కారణంగా మెమరీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏడాదిలో 5 శాతం మేర బలహీనపడటం, అలాగే ప్రముఖ బ్రాండ్లు లాభదాయకత పెంపుపై దృష్టి సారిస్తూ అధిక సగటు విక్రయ ధరల (ఏఎస్‌పీ) వ్యూహాన్ని అనుసరించడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని అధ్యయం విశ్లేషించింది.

ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Smartphone
Second Hand
festive sale
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

నెట్టింటి నిండా సైబర్‌ సైకోలే!

నెట్టింటి నిండా సైబర్‌ సైకోలే!

స్మార్ట్‌ఫోన్ ఉంటే.. అయిపోతుంది ఇల్లు స్మార్ట్‌గా!

స్మార్ట్‌ఫోన్ ఉంటే.. అయిపోతుంది ఇల్లు స్మార్ట్‌గా!

ఐక్యూ15ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే?

ఐక్యూ15ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌: ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.