Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

బయో ఇంధనంగా వంట నూనెలు

Business Sakshi User Sakshi Sakshi Time Mar 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BIOFUEL.jpg

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బయో ఇంధనాలకు డిమాండ్‌ పెరిగిపోయింది. దీని ఫలితంగా వంట నూనెలకు కొరత ఏర్పడుతోంది. ట్రక్కులు, విమానాలకు కూడా బయో ఫ్యూయల్స్‌ వాడకంపై దృష్టి సారించడంతో.. ఆహారమా/ఇంధనమా అన్న చర్చ మొదలైంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా తదితర ప్రభుత్వాలు సోయాబీన్స్‌ లేదా కనోలా లేదా జంతు కొవ్వుల నుంచి తీసిన నూనెను ఇంధనాలకు వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.



సంప్రదాయ శిలాజ ఇంధనాలకు (పర్యావరణ కాలుష్యానికి దారితీసే) బదులు బయో ఇంధనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. దీంతో పామాయిల్‌ తదితర నూనెలకు డిమాండ్‌ పెరుగుతోంది. డిమాండ్‌ చాలా అధికంగా ఉండడంతో వాడిన వంట నూనె, పామాయిల్‌ తయారీలో విడుదలయ్యే స్లడ్స్‌ అనే ఉత్పత్తి కోసం కంపెనీలు వేటను మొదలు పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పామాయిల్‌ తయారీ పరిశ్రమల్లో విడుదలయ్యే స్లడ్స్‌ బయో ఇంధనాల తయారీకి ముడి పదార్థంగా వినియోగిస్తున్నారు.  



అవరోధాలు..

బయో ఇంధనాలకు ఏర్పడిన అనూహ్య డిమాండ్‌ తీరే సానుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధం, తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నూనెల సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అర్జెంటీనాలో తీవ్ర కరువుతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. సోయాబీన్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనించొచ్చు. ఇక యూరప్‌లో హానికారక రసాయాల వినియోగంపై నియంత్రణలు నెలకొన్నాయి. ఇది అక్కడ రేప్‌సీడ్‌ ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిపై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రతికూలతల వల్ల వంట నూనెల తయారీ తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ద్వితీయ భాగంలో అంతర్జాతీయ మార్కెట్లో బయో ఇంధనాలకు కొరత ఏర్పడుతుందని ఆయిల్‌ వరల్డ్‌ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ మిల్కే తెలిపారు. వెజిటబుల్‌ నూనె మార్కెట్‌లో బయో ఇంధనాలు అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నాయని.. ప్రపంచంలో డిమాండ్‌ కంటే సరఫరా తక్కువే ఉన్నట్టు చెప్పారు.

అమెరికా, యూరప్, బ్రెజిల్, ఇండోనేషియా బయోడీజిల్, రెన్యువబుల్‌ డీజిల్, బయోజెట్‌ ఇంధనం వినియోగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అయితే సోయాబీన్‌ ఆయిల్, రేప్‌సీడ్‌ ఆయిల్, వాడిన వంట నూనె, జంతు కొవ్వులను వినియోగిస్తోంది. యూరప్‌లో వ్యర్థాలు, రేప్‌సీడ్‌ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. బ్రెజిల్‌ అయితే సోయాబీన్‌ ఆయిల్‌ను బయో ఇంధనాల తయారికి వాడుతోంది.



పామాయిల్‌కు అనుకూలతలు..

బయో ఇంధనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో పామాయిల్‌ ఉత్పత్తిదారులు, కంపెనీలు లాభపడనున్నాయి. అలాగే, ఇతర నూనె గింజలు, వెజిటబు ల్‌ నూనెల వినియోగం కూడా బయో ఇంధనాల తయారీలో పెరుగుతోంది. ఈ డిమాండ్‌ పామాయిల్‌కు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  కానీ, డిమాండ్‌ పెరిగితే అప్పుడు పామాయిల్‌కు సైతం కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.

ఎందు కంటే ఇండోనేషియా, మలేషియా ప్రపంచ పామాయిల్‌ ఉత్పత్తిలో 85 శాతం వాటా ఆక్రమిస్తున్నా యి. కానీ ఈ దేశాల్లో ప్లాంటేషన్‌ నిదానంగా సాగడం, ఉన్న పంటల వయసు పెరిగిపోవడం, ఉత్పత్తి లేని చెట్ల సంఖ్య పెరగడం, అటవీ భూముల వినియోగంపై ఆంక్షలు విస్తరణకు అడ్డుగా ఉన్నాయి. బయో ఇంధనాలకు డిమాండ్‌ పెరిగిపోతే అది ముడి సరుకు సరఫరా కొరతకు దారితీయవచ్చని.. అదే జరిగితే అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bio fuels
demand
cooking oil
SCARCITY
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వంట నూనెలు సలసల!

వంట నూనెలు సలసల!

92 దాటేసిన రూపాయి!

92 దాటేసిన రూపాయి!

లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌

లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌

లడ్డూ కల్తీ, ఇందాపూర్ డైరీపై చర్చకు YSRCP డిమాండ్

లడ్డూ కల్తీ, ఇందాపూర్ డైరీపై చర్చకు YSRCP డిమాండ్

సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

మళ్లీ వెండి వేడి

మళ్లీ వెండి వేడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.