Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడి

Business Sakshi User Sakshi Sakshi Time Mar 17, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gold001.jpg

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సార్వత్రిక గోల్డ్‌ బాండ్ల(ఎస్‌జీబీ)కు సంబంధించి తుది రిడంప్షన్ ధరను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగబోతుంది. 2016-17 సిరీస్ 4(ఎనిమిదేళ్లు), 2019-20 సిరీస్ 4(ఐదేళ్లు)లో పెట్టుబడిదారులు ఈమేర​కు గణనీయమైన రాబడిని పొందనున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎస్‌జీబీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

2017 ఫిబ్రవరిలో గ్రాముకు రూ.2,943 చొప్పున జారీ చేసిన 2016-17 సిరీస్ 4 బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ.8,624గా రీడీమ్ చేసి 193 శాతం రాబడిని అందించనున్నారు. అదే ధరకు 2019 సెప్టెంబర్‌లో జారీ చేసిన 2019-20 సిరీస్ 4లో ఇన్వెస్టర్లు గ్రాముకు రూ.8,634 చొప్పున బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ రెండు సిరీస్‌లకు రిడంప్షన్‌ను మార్చి 17న షెడ్యూల్ చేశారు.

రిడంప్షన్ ధర ఎలా లెక్కిస్తారంటే..

బాండ్లను రిడంప్షన్‌ చేసుకునేవారికి ఆ తేదీకి ముందు గడిచిన మూడు పనిదినాల్లో సగటు బంగారం ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఉంటుంది రాబడిని లెక్కిస్తారు. ఈ బాండ్ సిరీస్ కోసం ఐబీజేఏ 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో బంగారం ధరలను లెక్కించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) ఎనిమిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. కానీ పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. ఈమేరకు సంబంధిత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఎస్‌జీబీ సిరీస్ 4 2019-20కు సంబంధించి ఐదేళ్లకాలానికి రిడీమ్‌ తేదీని మార్చి 17గా నిర్ణయించారు.

రిడీమ్‌ ప్రక్రియ ఇలా..

బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు వడ్డీ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నిర్దేశించిన బ్యాంకు, ఎస్‌హెచ్‌సీఐఎల్‌ కార్యాలయం, పోస్టాఫీసు లేదా ఏజెంట్ వద్ద దరఖాస్తు సమర్పించాలి. ఈ అభ్యర్థన మార్చి 17 కంటే కనీసం ఒక రోజు ముందుగా విజయవంతంగా ప్రాసెస్‌ అవుతుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆదాయం నేరుగా ఎస్‌జీబీ అప్లికేషన్‌తో లింక్ చేయబడిన ఇన్వెస్టర్‌ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటీ కంటే ముందు కూడా అత్యవసర సమయాల్లో పెట్టుబడులను ఉంపసంహరించుకోవచ్చు. కానీ దానిపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రాబడి తగ్గుతుంది.

మెచ్యూరిటీ వరకు ఎస్‌జీబీలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • పన్ను రహిత లాభాలు: మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.

  • గ్యారంటీడ్ వడ్డీ: 2.5 శాతం వార్షిక వడ్డీ స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.

  • మార్కెట్ లింక్డ్‌ రిటర్న్స్: ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో ముడిపడి రాబడి పెరుగుతుంది.

  • భద్రత: ప్రభుత్వ మద్దతు ఉండే ఎస్‌జీబీలు పెట్టుబడులకు భద్రత కల్పిస్తాయి.

ఏమిటీ ఎస్‌జీబీలు..?

ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరు­త్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.

ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్‌-గూగుల్‌ భాగస్వామ్యం..?

భారంగా మారిన బాండ్లు

భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్‌ బాండ్స్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gold Bond Scheme
Gold Bond
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!

భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!

బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..

బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..

గోల్డ్‌ బాండ్స్‌.. లక్కీ చాన్స్‌!

గోల్డ్‌ బాండ్స్‌.. లక్కీ చాన్స్‌!

గోల్డ్‌ కంటే గోల్డ్‌ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..

గోల్డ్‌ కంటే గోల్డ్‌ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..

బంగారం ఇలా కొంటే రూ.16 వేలు ఆదా..!

బంగారం ఇలా కొంటే రూ.16 వేలు ఆదా..!

18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

18 నుంచి 22 వరకు మూడో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.