Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్‌' అభివృద్ధి!

Business Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
real.jpg

నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్‌ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్‌ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్‌ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్‌ మీదుగా వెస్ట్‌తో సౌత్‌ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్‌ అడ్వాంటేజ్‌. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్‌ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్‌ మార్కెట్‌ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ..     – సాక్షి, సిటీబ్యూరో

నగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్‌ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్‌ ఎస్టేట్‌ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్‌ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్‌ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.

ట్రిపుల్‌ ఆర్‌తో ఉద్యోగ అవకాశాలు 
హైదరాబాద్‌ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ట్రిపుల్‌ ఆర్‌)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్‌ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌కు, ట్రిపుల్‌ ఆర్‌ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్‌ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్‌ ఆర్‌తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్‌ ఆర్‌ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్‌.. 
లగ్జరీ హౌసింగ్‌ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్‌మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్‌ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్‌ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్‌ హైట్‌ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్‌ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.

ఇంటి అవసరం పెరిగింది  
గతంలో ఇండిపెండెంట్‌ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్‌ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్‌ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్‌ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్‌లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్‌ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్‌ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్‌ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
real estate
Development
south
Hyderabad
Realty
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.