Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

50 సెకన్లలో ట్రైన్ టికెట్ బుకింగ్!

Business Sakshi User Sakshi Sakshi Time Dec 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
train-ticket-booking.jpg

రైలు ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ట్రైన్ జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టమే. అయితే కొంతమంది మాత్రం కొన్ని రెంటర్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి.. టికెట్స్ బుక్ చేస్తున్నట్లు ఒక జాతీయ వార్తాపత్రిక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సాఫ్ట్‌వేర్‌లు ఏవి?, వాటిని ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?

రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ లేదా బుక్‌మైట్రిప్ వంటి కొన్ని నిర్దిష్ట యాప్స్ లేదా రైల్వే కౌంటర్స్ ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఏజెంట్స్ రెంటర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా 50 సెకన్లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. అంటే ప్రయాణికుడు IRCTC యాప్‌లోకి లాగిన్ అయ్యే సమయానికి, వాళ్లు(ఏజెంట్స్) టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట..!

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు.. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి అద్దె నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్‌లను కూడా మార్చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్‌ల మార్పు కోసం మరికొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఎక్కువ మంది టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ వంటి రెంటర్ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రయాణికుడు మాన్యువల్‌గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. లాగిన్, రైలు ఎంపిక, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా, చెల్లింపు వంటి ప్రక్రియలను స్వయంగా పూర్తిచేయాలి. ఈ సమయంలో, వేలాది మంది వినియోగదారులు సిస్టమ్‌లో ఏకకాలంలో యాక్టివ్‌గా ఉంటారు, ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు ఈ ప్రక్రియలో టిక్కెట్లు పొందలేకపోతున్నారు.

అయితే ఏజెంట్లు మాత్రమే ఇందుకు భిన్నంగా.. ఆటోమేషన్/AI సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సాధారణ వినియోగదారులతో పోలిస్తే చాలా రెట్లు వేగంగా సర్వర్‌కు అభ్యర్థనలను పంపుతుంది. ఈ కారణంగా సాధారణ ప్రయాణికులు టికెట్స్ వేగంగా పొందలేరు. అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రయాణికులు.. ఈ తరహా అక్రమ సాఫ్ట్‌వేర్లను వినియోగించే ఏజెంట్స్ సాయం తీసుకుంటున్నారు.

ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?
ఐఆర్‌సీటీసీ ఏజెంట్స్ ఉపయోగించే రెంటల్ సాఫ్ట్‌వేర్‌లను ఆరికట్టకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన లొసుగులు. ఆటోమేషన్ అండ్ ఏఐ బేస్డ్ టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తిగా నిషేధించే కఠినమైన చట్టాలు లేవు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టం, రైల్వే చట్టాలు, నిబంధనలు దీనిని పాక్షికంగా మాత్రమే నియంత్రిస్తున్నాయి. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే వీలు లేకుండా పోతోంది. 

దీంతోపాటు.. టెక్నాలజీ మరో కారణంగా చెప్పవచ్చు. వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే ఐపీ అడ్రస్‌లను భారతీయ రైల్వేలు బ్లాక్ చేస్తాయి. కానీ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీలను మారుస్తారు. వీపీన్‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఈ సాఫ్ట్‌వేర్లను అరికట్టడం ఐఆర్‌సీటీసీకి సాధ్యం కావడం లేదు.

ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Train ticket
Train ticket booking
Tatkal booking
software developer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

నెల రోజుల్లో IRCTC కొత్త వెబ్‌సైట్‌..

నెల రోజుల్లో IRCTC కొత్త వెబ్‌సైట్‌..

ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!

ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!

టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ

టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ

ఇండియన్ రైల్వే.. టికెట్ ఛార్జీలు పెరిగాయ్.. ఎంతంటే?

ఇండియన్ రైల్వే.. టికెట్ ఛార్జీలు పెరిగాయ్.. ఎంతంటే?

ఢిల్లీ–సికింద్రాబాద్‌ రైలు టికెట్‌ రూ.10,200!

ఢిల్లీ–సికింద్రాబాద్‌ రైలు టికెట్‌ రూ.10,200!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.