Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

బ్యాంకింగ్‌కు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కష్టాలు 

Business Sakshi User Sakshi Sakshi Time May 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
QUANTUM-COMPUTING.jpg

వచ్చే మూడేళ్లలో ముప్పులు గణనీయంగా పెరిగే అవకాశం 

ఫిషింగ్, డీడీవోఎస్, సోషల్‌ ఇంజినీరింగ్‌ రిస్క్ లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగానికి గణనీయంగా ముప్పు పొంచి ఉందని ఐఎస్‌బీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ (ఐఐడీఎస్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ రిస్కులను ఎదుర్కొనడానికి ఆయా రంగ సంస్థలు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. సంప్రదాయ కంప్యూటర్ల పరిధికి మించిన సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్‌ మెకానిక్స్‌ సూత్రాలపై పని చేసే విప్లవాత్మకమైన కంప్యూటింగ్‌ విధానమే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.

 సంప్రదాయ కంప్యూటర్లు, బిట్స్‌ (0 లేదా 1)ను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తాయి. సంక్లిష్టమైన విషయాలను ప్రాసెస్‌ చేయడంలో వాటి సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. మరోవైపు క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ అనేవి సమస్యలను పరిష్కరించేందుకు సూపర్‌పొజిషన్, టనెలింగ్, ఇంటర్‌ఫియరెన్స్‌లాంటి క్వాంటమ్‌ ఫిజిక్స్‌ సూత్రాలను కూడా ఉపయోగిస్తాయి. ఈ విభాగంలో పలు కొత్త ఆవిష్కరణలు వస్తున్నప్పటికీ, ఎర్రర్‌ రేట్‌లను తగ్గించడం, పెద్ద స్థాయిలో విస్తరించడం వంటి అంశాల్లో సవాళ్లు ఉంటున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటర్లు స్వభావరీత్యా సున్నితమైనవిగా ఉంటాయి. 

దీంతో చుట్టుపక్కల ఏ కాస్త గందరగోళ పరిస్థితి ఉన్నా, అవి ప్రభావితమై తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సామర్థ్యాలు పెరిగే కొద్దీ హ్యాకర్లు ఎలాంటి సంక్లిష్టమైన ఎన్‌క్రిప్షన్‌నైనా ఛేదించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు ముప్పులు పొంచి ఉన్నాయి. దేశీయంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వల్ల పొంచి ఉన్న ప్రత్యేకమైన సవాళ్లను అర్థం చేసుకునేందుకు, వాటిని అధిగమించేందుకు తీసుకోతగిన చర్యల గురించి ఈ నివేదిక కీలకంగా ఉంటుందని ఐఎస్‌బీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్ట్ర ప్రొఫెసర్‌ మనీష్‌ గంగ్వార్‌ తెలిపారు. 

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 
→ ఈ అధ్యయనానికి సంబంధించిన సర్వేలో పాల్గొన్న వారిలో 57.5 శాతం మంది వచ్చే మూడేళ్లలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గణనీయమైన ముప్పుగా పరిణమించవ్చచని భావిస్తున్నట్లు తెలిపారు. అత్యంత సాధారణంగా ఎదురయ్యే ముప్పుల్లో ఫిషింగ్‌ దాడులు (65 శాతం), డీడీవోఎస్‌ దాడులు (47.5 శాతం), సోషల్‌ ఇంజినీరింగ్‌ (40 శాతం) ఉండొచ్చని వారు పేర్కొన్నారు. 

→ బీఎఫ్‌ఎస్‌ఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్లలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గురించి అవగాహన ఒక మోస్తరుగానే ఉంది. క్వాంటమ్‌ కంప్యూటర్ల ముప్పులను కూడా అధిగమించగలిగే క్రిప్టోగ్రఫీని (పీక్యూసీ) అమలు చేసే సన్నద్ధత అంతంతమాత్రంగానే .. 5 పాయింట్లకు గాను సగటున 2.4 శాతం స్థాయిలో ఉంది. ఫైర్‌వాల్స్‌లాంటి సర్వసాధారణంగా ఉండే భద్రతా చర్యలను విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ చొరబాట్లను గుర్తించే అధునాతన సిస్టంలు, బలహీనతలను సమర్ధవంతంగా అధిగమించగలిగే సాధనాలను వినియోగం తక్కువగానే ఉంటోంది. 

→ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్‌లో పురోగతి సాధించడంతో సైబర్‌సెక్యూరిటీ రిస్క్ ల తీరుతెన్నులు మారాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో వ్యాపార వృద్ధి అవకాశాలు పెరిగినా, ప్రస్తుత పబ్లిక్‌ కీ క్రిప్టోగ్రఫీ (పీకేసీ) అల్గోరిథంలకు గణనీయంగా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సవాళ్లను అధిగమించేందుకు పీక్యూసీ వినియోగాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలు .. మార్గదర్శకాలకు ప్రాధాన్యమివ్వడం, సైబర్‌సెక్యూరిటీపై అవగాహన పెంచడం, క్వాంటమ్‌ను నిలువరించే టెక్నాలజీలపై పరిశోధనలకు నిధులు సమకూర్చడం, పరిశ్రమవర్గాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
quantum computing
banking
financial authorities
insurance sector
ISB
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI

పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI

పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

బీమా వృద్ధికి ఎఫ్‌డీఐల దన్ను 

బీమా వృద్ధికి ఎఫ్‌డీఐల దన్ను 

బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

బ్యాంకుల్లో మిస్‌ సెల్లింగ్‌కు ముగింపు!

బ్యాంకుల్లో మిస్‌ సెల్లింగ్‌కు ముగింపు!

బ్యాంకులకు వరుస సెలవులు!

బ్యాంకులకు వరుస సెలవులు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.