Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

గుడ్‌న్యూస్‌: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..

Business Sakshi User Sakshi Sakshi Time Sep 17, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pm-vishwakarma-scheme.jpg

చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) పథకాన్ని ప్రధాన ‌మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు.

ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్‌లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం.

రెండు విడతల్లో..

పీఎం విశ్వకర్మ పథకం ​కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇతర ప్రయోజనాలు

పీఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ లోన్‌తోపాటు మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. లబ్ధిదారులకు మొదట 5-7 రోజుల (40 గంటలు) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజుల (120 గంటలు) అధునాతన శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 అందిస్తారు. తర్వాత వారి వృత్తిలో భాగంగా నిర్వహించే డిజిటల్‌ లావాదేవీలకు ఒక్కోదానికి రూ. 1 చొప్పున నెలవారీ 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం చెల్లిస్తారు. లబ్ధిదారుల ఉత్పత్తులకు నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ప్రమోషన్, ఈ-కామర్స్ అనుసంధానం, ట్రేడ్ ఫెయిర్స్ ప్రకటనలు, ప్రచారం, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను జాతీయ మార్కెటింగ్ కమిటీ అందిస్తుంది.

అర్హతలు 

స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో పని చేసే చేతివృత్తులపై ఆధారపడినవారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పేర్కొన్న 18 కుటుంబ ఆధారిత సాంప్రదాయ హస్తకళలు లేదా చేతివృత్తుల్లో ఏదో ఒకదానిలో నిమగ్నమైనవారు ఈ పథకానికి  అర్హులు. అలాగే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
central govt scheme
Narendra Modi
new scheme
Loan Scheme
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.