Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?

Business Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
qaa.jpg

నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? – జయ్‌దేవ్‌

ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్‌లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచ్చితంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్‌ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు.

స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్‌ను అధిగమించేందుకు డెట్‌ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్‌ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్‌ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.  

నేను సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్‌ ముఖర్జీ

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్‌ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్‌–2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు.

ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్‌ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా ఎలాంటి పెనాల్టీ పడదు.


ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ చేసుకోవాలా?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
answers
Direndra Kumar
Experts
Financial advisor
Literacy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!

పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!

వృథా కానీ ఎకనమీగా వెదురు.. సాగు ఒక్కటే చాలదు!

వృథా కానీ ఎకనమీగా వెదురు.. సాగు ఒక్కటే చాలదు!

ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

నాన్‌వెజ్‌ వెరైటీలకు యువత ఫిదా,  వైద్యుల హెచ్చరిక

నాన్‌వెజ్‌ వెరైటీలకు యువత ఫిదా, వైద్యుల హెచ్చరిక

వెయిట్‌లాస్‌ మందులతో స్లిమ్‌గా ఐశ్వర్య మోహన్ రాజ్..!  నిపుణులు ఏమంటున్నారంటే..

వెయిట్‌లాస్‌ మందులతో స్లిమ్‌గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.