Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..

Business Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ISTOCK-647358572.jpg

మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సి రావడమే కారణం 

అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీల అంచనాలు 

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 

దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి.  2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి   సంబంధించిన ప్రభావాలపై ఫిచ్‌ రేటింగ్స్, మూడీస్‌ రేటింగ్స్‌ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.

ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్‌.. 
పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్‌ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది.

 ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్‌ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే  2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్‌ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.

ల్యాండ్, లేబర్‌ సంస్కరణల అమలు కష్టమే
‘బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్‌ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్‌ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్‌ తెలిపింది. 

మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్‌ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్‌ (కంట్రీ రిస్క్‌) డారెన్‌ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Lok Sabha Election Results 2024
India
international investors
Reforms
rating agencies
coalition government
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.