Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కొంచెం ఆగి చూద్దాం!

Business Sakshi User Sakshi Sakshi Time Sep 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WAIT-AND-WATCH-GST-2.0.jpg

జీఎస్‌టీ తగ్గింపు నేపథ్యంలో వేచి చూసే ధోరణి 

ఇది తాత్కాలికమేనంటున్న నిపుణులు

న్యూఢిల్లీ: కీలకమైన పండుగల సమయంలో వినియోగదారులు (ఆన్‌లైన్‌ షాపర్లు) ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్‌ గూడ్స్‌ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) క్రమబద్దీకరణతో రేట్లు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, ఒక్కసారి పన్ను రేట్లపై స్పష్టత వస్తే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయన్నది నిపుణుల అంచనా. 

కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్‌టీలో శ్లాబుల తగ్గింపును వేగంగా అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ కానుంది. ప్రస్తుతం వివిధ రకాల వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం జీఎస్‌టీ రేట్లు అమల్లో ఉండడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులను ఎత్తివేయాలన్నది ప్రతిపాదన. అప్పుడు అధిక శాతం వస్తు సేవలు 5 లేదా 18 శాతం రేట్ల పరిధిలోకి వస్తాయి. వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎన్నో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గనుంది.  

ఈ–కామర్స్‌పై కనిపిస్తున్న మార్పు.. 
ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారుల కొనుగోళ్ల పరంగా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ పార్ట్‌నర్‌ నవీన్‌ మల్పానీ తెలిపారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విషయంలో ఈ ధోరణి నెలకొన్నట్టు చెప్పారు. ‘‘జీఎస్‌టీ రేట్లపై స్పష్టత ఆలస్యమయితే అప్పుడు ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు తదితర విభాగాలపై 25–30 శాతం మేర ప్రభావం పడొచ్చు. కొత్త శ్లాబులు అమల్లోకి వస్తే రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ప్రస్తుత వేచి చూసే ధోరణికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు రూ.1.2 లక్షల ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ధర జీఎస్‌టీలో సంస్కరణల అనంతరం 10 శాతం మేర తగ్గనుంది. ఈ అంచనాలు కొనుగోళ్ల నిర్ణయాలను వాయిదా వేసుకునేందుకు దారితీస్తున్నాయి’’అని మల్పానీ వివరించారు. 

అమ్మకాలు వేగంగా పెరుగుతాయ్‌.. 
‘‘రిటైలర్ల వద్ద ఉత్పత్తుల నిల్వలు అధికంగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో కొనుగోళ్లు వాయిదా పడుతున్నాయి. పండుగల సీజన్‌ చివర్లో (అక్టోబర్‌) పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు ఈ–కామర్స్‌ సంస్థలు బ్రాండ్లతో సంప్రదింపులు చేస్తున్నాయి. జీఎస్‌టీలో పన్ను రేట్ల సవరణ ధరల వ్యూహాల్లోనూ మార్పులకు దారితీయనుంది. మొత్తం మీద సమీప కాలంలో కనిపించే ప్రభావం తాత్కాలికమే. కొత్త పన్నులపై ఒక్కసారి స్పష్టత వస్తే అమ్మకాలు వేగంగా పుంజుకుంటాయి’’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ శుభమ్‌ నింకార్‌ తెలిపారు. ఈ–కామర్స్‌ సంస్థలకు పండుగల సీజన్‌ ఎంతో కీలకం. వార్షిక అమ్మకాల్లో పావు శాతం ఈ సమయంలోనే నమోదవుతుంటాయి.

పండుగ షాపింగ్‌ ప్రత్యేకం..
పండుగల సమయంలో కొనుగోళ్లు కేవలం సంస్కృతిలో భాగమే కాకుండా, భావోద్వేగపరమైనవి అని షిప్‌రాకెట్‌ ఎండీ, సీఈవో సాహిల్‌ గోయల్‌ పేర్కొన్నారు. ‘‘కొత్త గృహోపకరణం అయినా, గ్యాడ్జెట్‌ అయినా లేక గృహ నవీకరణ అయినా పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు కుటుంబాలు ప్రణాళికలతో ఉంటాయి. ఈ అంతర్గత డిమాండ్‌ కచ్చితంగా కొనసాగుతుంది. జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ అన్నది కొనుగోళ్ల దిశగా వినియోగదారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. 

రేట్ల సవరణతో ధరలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది’’అని వివరించారు. జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ అన్నది నిర్మాణాత్మక సంస్కరణ అని, వినియోగానికి బలమైన ఊతం ఇస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ రజనీష్‌ కుమార్‌ సైతం అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీలో మార్పులు అమల్లోకి వచ్చినట్టయితే పండుగల సీజన్‌లో ఈ–కామర్స్‌ అమ్మకాలు మొత్తం మీద 15–20 శాతం పెరగొచ్చని (గతేడాదితో పోల్చితే) మల్పానీ అంచనా వేశారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Electronics
consumer goods
Postponement
Purchases
Goods and Services Tax
rates down
GST slabs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ట్రావెల్‌.. క్యాన్సిల్‌

ట్రావెల్‌.. క్యాన్సిల్‌

మెరుగ్గా జీఎస్‌టీ వసూళ్లు 

మెరుగ్గా జీఎస్‌టీ వసూళ్లు 

జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు

జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు

సంస్కరణల బాటా...సుంకాల మోతా..?

సంస్కరణల బాటా...సుంకాల మోతా..?

సిల్వర్‌ స్పీడుకు బ్రేక్‌ 

సిల్వర్‌ స్పీడుకు బ్రేక్‌ 

రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌పై ఫోకస్‌

రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌పై ఫోకస్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.