Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

Business Sakshi User Sakshi Sakshi Time Dec 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nhaii.jpg

జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ ఏం చెబుతోంది?

బెంగళూరులోని ఎన్‌హెచ్‌-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్‌హెచ్‌-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.

పారదర్శకత ఎక్కడ?

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్‌హెచ్‌ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.

To enhance transparency and improve ease of travel for National Highway users, NHAI is installing QR code-based information boards on key National Highway corridors in #Bengaluru. These QR boards are currently available on Bengaluru–Nelamangala section of NH-48 and… pic.twitter.com/jzgAfGQwnj

— NHAI (@NHAI_Official) December 15, 2025

ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలు

  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.

  • రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్‌లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
NHAI
QR Code
Installed
boards
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?

క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?

కాంబోడియాలో యూపీఐ చెల్లింపులు

కాంబోడియాలో యూపీఐ చెల్లింపులు

FASTag మంత్లీ పాస్: ఎలా పొందాలంటే?

FASTag మంత్లీ పాస్: ఎలా పొందాలంటే?

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ

టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ

‘రింగు’కు బఫర్‌

‘రింగు’కు బఫర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.