Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఎంఎస్‌ఎమ్‌ఈలో మందగించిన రుణ వృద్ధి 

Business Sakshi User Sakshi Sakshi Time Jun 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
MSMES.jpg

సూక్ష్మ వ్యాపారాల్లో పెరుగుతున్న చెల్లింపుల ఒత్తిడి 

తయారీ, వాణిజ్య రంగాల్లో బలహీనపడిన రుణ వృద్ధి 

పీఎస్‌యూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణాల జోరు తగ్గుదల 

ముంబై: అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో రుణాల వృద్ధి మందగించింది. ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలు, తయారీ రంగ అనుబంధ విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నట్లు క్రెడిట్‌ సమాచార సంస్థ క్రిఫ్‌ హైమార్క్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఎంఎస్‌ఎంఈల రుణ బకాయిలు సుమారు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 

బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, వివిధ రంగాల భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే రుణాల వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. 2025 డిసెంబర్‌–2026 ఏప్రిల్‌ మధ్య రుణ బకాయిల వృద్ధి 3.1 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 9.7 శాతంగా నమోదైంది. ఇదే వ్యవధి (2025 డిసెంబర్‌–2026 ఏప్రిల్‌)లో క్రియాశీల రుణాల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కాగా, 2024 డిసెంబర్‌–2025 ఏప్రిల్‌ మధ్య కాలంలో అవి 3 శాతం పెరిగాయి. 

సూక్ష్మ వ్యాపారాలపై అధిక ప్రభావం 
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ డిమాండ్, రుణాల ప్రవాహం మద్దతుతో ఎంఎస్‌ఎంఈ రంగం నిలకడగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని నిర్దిష్ట విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎంఎస్‌ఎంఈ రుణాల్లో దాదాపు 86 శాతం వాటా కలిగిన సూక్ష్మ వ్యాపారాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యాయి. 31–90 రోజుల ఆలస్య చెల్లింపుల సూచిక (పీఏఆర్‌) ఏప్రిల్‌ 2026 నాటికి 2.7 శాతానికి చేరింది. 2025 డిసెంబర్‌–2026 మార్చి మధ్య సూక్ష్మ వ్యాపారాలకు చెందిన క్రియాశీల రుణాలు 4.6 శాతం క్షీణించాయి. 

తయారీ రంగంలో తగ్గిన జోరు 
ఎంఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ, వాణిజ్య రంగాల్లో రుణ వృద్ధి మందగించింది. తయారీ రంగ రుణ వృద్ధి 2025 డిసెంబర్‌–2026 మార్చి మధ్య 4.3 శాతానికి పరిమితమైంది. దీనికి సీజనల్‌ మార్పులే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సప్లై చైన్‌తో ముడిపడి ఉన్న షిప్పింగ్, రవాణా, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటో అనుబంధ రంగాల్లో రుణ బకాయిలు 10–15 శాతం మేర తగ్గాయి. 

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వెనకడుగు 
ఎంఎస్‌ఎంఈలకు రుణాల పంపిణీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వేగం కూడా తగ్గింది. 2025 డిసెంబర్‌–2026 మార్చి మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంఎస్‌ఎంఈ రుణాలు 0.2 శాతం తగ్గాయి. కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు 1.6 శాతం క్షీణించగా, గత ఏడాది ఇదే కాలంలో 6.4 శాతం పెరిగాయి. దేశీయ డిమాండ్, విభిన్న రుణదాతల భాగస్వామ్యం, ప్రభుత్వ మద్దతు చర్యలతో ఎంఎస్‌ఎంఈ రంగం ప్రపంచ అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న ఒత్తిడి సంకేతాలపై నిశిత పర్యవేక్షణ అవసరమని నివేదిక సూచించింది.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
international
uncertainty
MSME sector
credit growth
decline
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూపాయి 30 పైసలు డౌన్‌

రూపాయి 30 పైసలు డౌన్‌

కోడింగ్‌ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం!

కోడింగ్‌ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం!

మట్టి పాటలే మనసు దాకా...– భీమ్స్‌ సిసిరోలియో

మట్టి పాటలే మనసు దాకా...– భీమ్స్‌ సిసిరోలియో

మార్కెట్‌కు హార్మూజ్‌ టెన్షన్‌!

మార్కెట్‌కు హార్మూజ్‌ టెన్షన్‌!

‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌!

‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌!

ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.. ఆరుగురూ మృతి

ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.. ఆరుగురూ మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.