Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఐటీ ఉద్యోగుల జీతాలు ఈసారి ఎలా ఉంటాయంటే..

Business Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
salary.jpg

దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్‌ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్‌ డిజిట్‌లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.

2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలు
గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది.  ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్‌ సైకిల్‌ను ఆలస్యం చేస్తున్నాయి.

పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు  టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.

ఇదీ చదవండి: టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!

ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి  కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.

పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్‌లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.

మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
business news
salary increments
salary hikes
IT industry
IT jobs
it employees
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.