Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

భారత్‌లోకి జెటూర్ టీ2.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

Business Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jetor.jpg

ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యు మోటార్స్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో ఈ రెండు కంపెనీల తొలి ఉత్పత్తిగా 'జెటూర్ టీ2' (Jetour T2) ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నాయి.

జెటూర్ టీ2 కారు ఇండియన్ మార్కెట్లో 2026 దీపావళి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జేఎస్‌డబ్ల్యు ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

జెటూర్ టీ2 ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్, స్కోడా కోడియాక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ సిస్టం పొందుతుంది. కాబట్టి మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న జెటూర్ టీ2లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 26.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఈ వాహనం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.

ఫీచర్ల విషయానికి వస్తే.. జెటూర్ టీ2లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ఏడీఏఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

గ్లోబల్ మార్కెట్లలో జెటూర్ టీ2 మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రారంభ దశలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లతో ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీ ఇస్తుందని పలువురు భావిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
JSW
china
Hybrid Car
new launches
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కియా కొత్త కారు.. రూ.526 కిమీ రేంజ్!

కియా కొత్త కారు.. రూ.526 కిమీ రేంజ్!

నిస్సాన్ టెక్టన్‌ లాంచ్: ధర, వివరాలు

నిస్సాన్ టెక్టన్‌ లాంచ్: ధర, వివరాలు

స్కోడా కొడియాక్ ఆర్ఎస్ లాంచ్!

స్కోడా కొడియాక్ ఆర్ఎస్ లాంచ్!

అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం

అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం

ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?

ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.