Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

iPhone: నీ దూకుడు.. సాటెవ్వరూ..!

Business Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
APPLE-BKC-MUMBAI-STORE-QUEU.jpg

భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్‌ అగ్రస్థానం 

విక్రయాల సంఖ్యపరంగా తొలిసారి టాప్‌–5 జాబితాలో చోటు 

దేశంలో పెరుగుతున్న యాపిల్‌ ఫ్యాన్స్‌ 

ధర ఎంతైనా కొనుగోళ్లకు వెనుకాడని వినియోగదారులు 

మారుమూల పల్లెలకూ పాకిన క్రేజ్‌

పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్‌లో ఐఫోన్‌ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్‌  ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు..  విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్‌–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.  

హైదరాబాద్, బిజినెస్‌  బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల  పరంగానూ ఐఫోన్‌ మార్కెట్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిలిచిన యూఎస్, అర్బన్‌ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్‌ సరసన భారత్‌ చేరింది. యాపిల్‌కు 5వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.

ఖరీదైనా తగ్గేదేలే..
సగటున ఐఫోన్‌ ధర సామ్‌సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్‌ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్‌ అంటే చాలా మందికి స్టేటస్‌. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది. 

దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. 

ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్‌లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్‌ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం.  

యాపిల్‌ పంట పండింది.. 
భారత్‌లో 2024లో అన్ని బ్రాండ్స్‌ కలిపి 15.3 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్ల విలువలో యాపిల్‌ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్‌–డిసెంబర్‌లో యాపిల్‌ 5వ స్థానానికి ఎగిసింది. 

వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్‌లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.

రికార్డుల భారత్‌.. 
యాపిల్‌ ఎగుమతులు భారత్‌ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్‌ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు. 

గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్‌ మోడళ్లు అయిన ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ సైతం భారత్‌లో తయారవడం విశేషం. హైదరాబాద్‌ సమీపంలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్‌పాడ్స్‌ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్‌ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది.  

భారీ అవకాశాలు ఉన్నాయ్‌..
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌గా ఐఫోన్‌ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఐఫోన్‌ అత్యధికంగా అమ్ముడై భారత్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లకు భారత్‌ రెండవ అతిపెద్ద విపణి. 

అలాగే పర్సనల్‌ కంప్యూటర్లు, టాబ్లెట్‌ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్‌ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్‌ త్రైమాసికంలో యాపిల్‌ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.      
– టిమ్‌ కుక్, సీఈవో, యాపిల్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Apple iPhone
iPhone 16 series
Indian smartphone market
Smartphone
Apple
iPhone
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఔరా... కైమెరా...!

ఔరా... కైమెరా...!

డెత్‌ యాపిల్‌.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి!

డెత్‌ యాపిల్‌.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి!

బుడతడి బిగ్‌ షాట్‌.. అమ్మ ఐఫోన్‌ జలసమాధి

బుడతడి బిగ్‌ షాట్‌.. అమ్మ ఐఫోన్‌ జలసమాధి

టాటా ఐఫోన్‌ ప్లాంట్‌కు క్లీన్‌ చిట్‌

టాటా ఐఫోన్‌ ప్లాంట్‌కు క్లీన్‌ చిట్‌

ఈ ఆపిల్‌ తోటలు ఎక్కడ?

ఈ ఆపిల్‌ తోటలు ఎక్కడ?

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.