Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..

Business Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
infy01.jpg

ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: భారత్‌లో బ్లాక్‌రాక్‌ కొత్తగా 1,200 ఉద్యోగాలు

ఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్ర

కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Infosys Narayana Murthy
Infosys
Narayana Murthy
AI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్‌ ఉద్యోగాల కోత

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

టెకీలు.. AI వాడితే సేఫ్‌.. లేకుంటే లేఆఫ్‌!

టెకీలు.. AI వాడితే సేఫ్‌.. లేకుంటే లేఆఫ్‌!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.