Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య': దీని గురించి తెలుసా?

Business Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indias-first-air-taxi.jpg

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.

శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.

సరళ ఏవియేషన్‌ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్‌లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.


సరళ ఏవియేషన్‌ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.

ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రం
నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది.

ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం

భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.

ప్రయాణ ఖర్చు తక్కువే..
ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్‌'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Air taxi
Air taxi service
Auto Expo 2025
Bharat Mobility Global Expo 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

త్వరలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ

త్వరలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ

ఎయిర్ ట్యాక్సీ సర్వీసు ప్రారంభం త్వరలోనే..

ఎయిర్ ట్యాక్సీ సర్వీసు ప్రారంభం త్వరలోనే..

ట్రాఫిక్‌ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..

ట్రాఫిక్‌ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..

ఎయిర్‌ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి

ఎయిర్‌ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి

గాల్లో తేలిపోవచ్చు.. ఇట్టే వాలిపోవచ్చు

గాల్లో తేలిపోవచ్చు.. ఇట్టే వాలిపోవచ్చు

ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ స్కూటర్‌ (ఫొటోలు)

ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ స్కూటర్‌ (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.