Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కొత్త ట్రెండ్‌.. ‘ఇన్సూరెన్స్‌’ సీఈఓల రాజీనామాలు..

Business Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indian-insurance.jpg

న్యూఢిల్లీ: భారతీయ జనరల్‌ ఇన్సూరెన్స్‌ రంగంలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది. ప్రముఖ బీమా సంస్థల సీఈఓలు తమ పదవులకు రాజీనామా చేసి సొంత వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో సాధారణ బీమా (జనరల్‌ ఇన్సూరెన్స్‌) రంగంలో వృద్ధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. బీమా రంగంలో అపార అనుభవం కలిగిన సీఈఓలకు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి గణనీయమైన నిధుల మద్దతు లభిస్తోంది.

ఐఆర్‌డీఏఐ సంస్కరణలు.. డిజిటల్‌ జోరు 
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన పలు సంస్కరణలతో వ్యాపార నిర్వహణ సులభతరమైంది. దీంతో బీమా రంగం ‘ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ’గా మారింది. కొత్త సంస్థల ప్రవేశాన్ని కూడా నియంత్రణ సంస్థ సానుకూలంగా స్వాగతిస్తోంది. మరోవైపు ‘బీమా సుగమ్‌’ వంటి డిజిటల్‌ పంపిణీ మౌలిక సదుపాయాలు, యూపీఐ తరహా కస్టమర్‌ యాక్సెస్‌ విధానాలు బీమా రంగ వ్యాపార నమూనాలను మౌలికంగా మార్చుతున్నాయి.  

బీమా రంగంలో అపార అవకాశాలు 
ఆసియా ఆర్థిక సేవల రంగంలో భారత జనరల్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమ అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాల్లో ఒకటిగా నిలుస్తోందని అపియరీ కన్సల్టింగ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ హరిహరన్‌ రామకృష్ణన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ బీమా వ్యాప్తి జీడీపీలో సగటున నాలుగు శాతానికి పైగా ఉండగా, భారత్‌లో అది కేవలం ఒక శాతానికే పరిమితమైందన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

‘‘కేవలం పెట్టుబడులతోనే ఈ మార్కెట్‌లోని అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు గుర్తించాయి. ఈ అవకాశాలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచడానికి అనుభవజ్ఞులైన రంగ నిపుణులు అవసరం. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఈఓలు నియంత్రణ సంస్థలతో సంబంధాలు, పంపిణీ వ్యవస్థపై నమ్మకం, రిస్క్‌ అంచనా సామర్థ్యం వంటి కీలక బలాలను వెంట తెచ్చుకుంటారు. కొత్త సంస్థలు ఇదే స్థాయి విశ్వసనీయతను, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది’’ అని రామకృష్ణన్‌ తెలిపారు.

స్టార్‌ హెల్త్‌ ఒక ఆదర్శం  
‘‘యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సీఎండీగా పదవీ విరమణ చేసిన అనంతరం వెంకటసామి జగన్నాథన్‌ చెన్నైలో చిన్న కార్యాలయం నుంచి ప్రారంభించిన స్టార్‌ హెల్త్‌ను రూ.30,000 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. విషయ పరిజ్ఞానం, వ్యాపార దృక్పథం, ఓపికతో కూడిన పెట్టుబడులు కలిస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేందుకు స్టార్‌ హెల్త్‌ ఉదంతం నిరూపించింది’’ అని అని రామకృష్ణన్‌ పేర్కొన్నారు.

రాజీనామాలు.. కొత్త సంస్థల ఏర్పాటు 
బీమా రంగంలో విశేష అనుభవం ఉన్న పలువురు మాజీ సీఈఓలు, టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల మద్దతుతో కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

నీలేష్‌ గార్గ్‌ (కివి జనరల్‌ ఇన్సూరెన్స్‌)
టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మాజీ ఎండీ, సీఈఓ నీలేశ్‌ గార్గ్‌ అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌తో కలిసి ‘కివీ జనరల్‌ ఇన్సూరెన్స్‌’ను స్థాపించారు. ఈ సంస్థలో వెస్ట్‌బ్రిడ్జ్‌ 70 శాతం, గార్గ్‌ 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ మార్చి 2026లో ఈ సంస్థకు రిజి్రస్టేషన్‌ సర్టిఫికేట్‌ మంజూరు చేసింది.

అనుజ్‌ త్యాగి (హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో)
కివీ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు అనుమతి లభించిన మూడు నెలలకే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ అనుజ్‌ త్యాగి తన వ్యాపార లక్ష్యాలను కొనసాగించేందుకు పదవికి రాజీనామా చేశారు.

అనూప్‌ రావు (జెనరాలి సెంట్రల్‌ ఇన్సూరెన్స్‌) 
ఇదే ఏడాది మార్చిలో జెనరాలి సెంట్రల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ అనూప్‌ రావు తన ఏడేళ్ల పదవీకాలం అనంతరం వైదొలిగారు. ఆయన కొత్త బీమా సంస్థలో షేర్‌హోల్డర్‌ లేదా ఫౌండేషన్‌ భాగస్వామిగా చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే నెలల్లో మరో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సీఈఓ కూడా వైదొలిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Insurance companies
CEOs
resign
Startups
New venture
New Trend
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బరువెక్కిన హృదయంతో వైదొలగుతున్నా!

బరువెక్కిన హృదయంతో వైదొలగుతున్నా!

కర్ణాటక మంత్రి వర్గంలో కలకలం.. రంగంలోకి దిగిన డీకే

కర్ణాటక మంత్రి వర్గంలో కలకలం.. రంగంలోకి దిగిన డీకే

'అన్నామలై రాజీనామా చేయలేదు'

'అన్నామలై రాజీనామా చేయలేదు'

బీజైపీకీ  అన్నామలై గుడ్‌బై..?

బీజైపీకీ అన్నామలై గుడ్‌బై..?

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇంటి బయట ఫర్నీచర్‌.. ఇదే కొత్త ట్రెండ్‌!

ఇంటి బయట ఫర్నీచర్‌.. ఇదే కొత్త ట్రెండ్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.