Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT

బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్‌పాట్‌!

Business Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jackpot-.jpg

సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్‌ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ను స్క్రీన్‌ షాట్లు తీసి సరదాగా స్టేటస్‌లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్‌ అకౌంట్‌తోనే జాక్‌పాట్‌ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?

అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్‌ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్‌ బ్యాంక్‌ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్‌ఐబీ మిలియనీర్‌’ సేవింగ్స్‌ రివార్డ్స్‌ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్‌ ప్రైజ్‌గా లభించింది. షాజీర్‌ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.

బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్‌ ఎస్‌ఐబీ డిజిటల్‌ యాప్‌ ద్వారా సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్‌ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్‌ ప్రైజ్‌కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్‌షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.

దీనిపై స్పందించిన షాజీర్‌.. “ఎస్‌ఐబీ మిలియనీర్‌ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్‌లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్‌లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.

కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్‌ బ్యాంక్‌ 2025లో ‘ఎస్‌ఐబీ మిలియనీర్‌’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్‌ లేదా డిపాజిట్‌ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్‌ల బ్యాలెన్స్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్‌ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.

Congratulations to the winners of SIB Millionaire Draw!

Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.

We also congratulate forty other winners who received valuable cash prizes.

Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs

— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Wins
jackpot
bank account
UAE
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్!

ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

తమిళనాడు నుంచి దుబాయికి  బస్సు టికెట్‌

తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్‌

మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!

మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.