Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఐపీవో బూమ్‌

Business Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
VINSYS-IPO.jpg

న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్‌ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.

వీటిలో ఐకియో లైటింగ్, సెన్‌కో గోల్డ్, గ్లోబల్‌ సర్ఫేస్, ఐడియాఫోర్జ్‌ టెక్, డివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్‌ ఫార్మా, నెట్‌వెబ్‌ టెక్, ఉత్కర్‌‡్ష ఎస్‌ఎఫ్‌బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్‌ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్‌ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్, బీఎల్‌ఎస్‌ ఈసరీ్వసెస్‌ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం..



ఏరోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్లెక్సిబుల్‌ హోస్‌ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్‌ సంస్థ శాట్‌ ఇండస్ట్రీస్‌ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది.



ప్రస్తుతం ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది.   



 సెల్లో వరల్డ్‌

సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు.



ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్‌ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్‌ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్‌ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్‌ వేర్‌ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది.  



హ్యాపీ ఫోర్జింగ్స్‌

ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది.

ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్‌మెంట్‌ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్‌ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్‌ లేలాండ్, ఎంఅండ్‌ఎం, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది.



18 నుంచి బొండాడ ఇంజినీరింగ్‌ ఐపీవో

టెలికం, సౌర విద్యుత్‌ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్‌ చేయనున్నామని వివరించారు.

పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్‌ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని

వివరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Domestic stock markets
Solid
Primary markets
public issues
fundraising
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

జీడీపీ, ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌ 

జీడీపీ, ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌ 

పశ్చిమాసియా పైనే మార్కెట్‌ ఫోకస్‌

పశ్చిమాసియా పైనే మార్కెట్‌ ఫోకస్‌

బడ్జెట్, ఫెడ్‌ పైనే ఫోకస్‌

బడ్జెట్, ఫెడ్‌ పైనే ఫోకస్‌

వెంచర్‌ క్యాపిటల్‌కు బై ఐపీఓకు.. హాయ్‌ 

వెంచర్‌ క్యాపిటల్‌కు బై ఐపీఓకు.. హాయ్‌ 

2025లో అహో 2026లో ఒహో

2025లో అహో 2026లో ఒహో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.