Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఏఐ నిపుణులు @ 4 లక్షలు 

Business Sakshi User Sakshi Sakshi Time May 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AI-EXPORTS.jpg

డిమాండ్‌–సరఫరా మధ్య 51 శాతం అంతరం 

రూ. 8–45 లక్షల పైగా స్థాయిలో ఆకర్షణీయమైన వేతనాలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 4.16 లక్షలకు చేరింది. అయితే నిపుణులు లభిస్తున్నప్పటికీ, డిమాండ్‌–సరఫరా మధఅయ ఏకంగా 51 శాతం అంతరం ఉంటోంది. భవిష్యత్‌ అవసరాలకు సన్నద్ధతను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని స్టాఫింగ్‌ సేవల సంస్థ క్వెస్‌ కార్ప్‌ ఒక నివేదికలో వివరించింది. దీని ప్రకారం ఏఐ నిపుణుల నియామకాలు 2017 నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. 

గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏఐ, డేటా నిపుణులకు డిమాండ్‌ దాదాపు 45 శాతం పెరిగినట్లు క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈవో కపిల్‌ జోషి తెలిపారు. జెన్‌ఏఐ ఇంజినీరింగ్‌లో పది ఉద్యోగావకాశాలు ఉంటే అన్ని అర్హతలు కలిగిన నిపుణుడు ఒక్కరే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏఐ విప్లవానికి సార్థ్యం వహించే సామర్థ్యాలు భారత్‌కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీన్ని అందిపుచ్చుకోవాలంటే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విధానకర్తలు ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  

ఆకర్షణీయ వేతనాలు.. 
ఎంట్రీ లెవెల్‌ నిపుణులకు వార్షికంగా రూ. 8–12 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. ఇక ఎన్‌ఎల్‌పీ, జెన్‌ఏఐలో 5–8 ఏళ్ల అనుభవమున్న వారికి రూ. 25–35 లక్షల వరకు జీతభత్యాలు ఉంటున్నాయి. అటు ప్రోడక్ట్‌ సంస్థలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ రూ. 45 లక్షల పైగా అందుకుంటున్నారు.  

→ ఏఐ నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం ముందు వరుసలో ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ఈ రంగం వాటా 24 శాతంగా ఉంటోంది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ సరీ్వసులు, హెల్త్‌కేర్‌ ఉన్నాయి.  
→ డేటా సైంటిస్టులు, ఎంఎల్‌ ఇంజినీర్లు, ఏఐ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటోంది. ఏఐ ప్రోడక్ట్‌ మేనేజర్లు, బిజినెస్‌ అనలిస్టులకు కూడా హైరింగ్‌ అవకాశాలు బాగుంటున్నాయి.  
→ నైపుణ్యాలపరంగా చూస్తే పైథాన్‌ ల్యాంగ్వేజ్‌ ఆధి పత్యం కొనసాగుతోంది. అలాగే టెన్సర్‌ఫ్లో, పై టార్చ్, కేరాస్‌లాంటి ఫ్రేమ్‌వర్క్‌లకు ప్రాధా న్యం ఉంటోంది. ఎన్‌ఎల్‌పీ, కంప్యూటర్‌ విజన్, జెనరేటివ్‌ ఏఐ, క్లౌడ్‌ (ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ), ఎంఎల్‌ఆప్స్‌ నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి. 
→ జెన్‌ఏఐపరమైన నియామకా>ల్లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్రోల పరిధిని దాటి ఏఐ టాలెంట్‌ హబ్‌లు ఎదుగుతున్నాయనడానికి నిదర్శనంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఇప్పుడు 14–16 శాతంగా ఉంది. వీటిలోనూ కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్‌ నగరాల వాటా 70 శాతంగా ఉంది.  
→ జీసీసీల నుంచి జెన్‌ఏఐకి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ హైరింగ్‌లో జీసీసీల వాటా23 శాతంగా ఉంది.  
→ దేశీయంగా ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. విద్యారంగం, పరిశ్రమ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి పని చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించే ప్రోగ్రాంలను రూపొందించాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Artificial Intelligence (AI)
Experts
Shortage
Recruitment
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!

పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.