Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్‌ రూల్స్‌లో మార్పు

Business Sakshi User Sakshi Sakshi Time Aug 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
icicii.jpg

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎంఏబీ పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్‌ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

ఈ నిర్ణయం వ్యూహాత్మకమేనని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. తక్కువ బ్యాలెన్స్ ఉన్న చాలా మంది పొదుపు ఖాతాదారులు ఐసీఐసీఐ బ్యాంకును ద్వితీయ ఖాతాగా భావిస్తున్నారు. అదే సమయంలో ప్రీమియం కస్టమర్లతో సమానంగా బ్యాంకు సేవలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రాబడులు లేకుండానే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నట్లు బ్యాంకు భావిస్తోంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ‘మ్యూల్ ఖాతాలు(అనైతిక కార్యకలాపాలు, మనీలాండరింగ్‌ కోసం ఉపయోగించేలా)’గా వాడే అవకాశం ఉంది. ఖాతాల్లో అధిక బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లపై దృష్టి పెట్టడం ద్వారా బ్యాంక్ ఈ మ్యూల్‌ ఖాతాలను లక్ష్యం చేసుకోనుంది. ఈ కొత్త విధానం ద్వారా స్థిర ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తుంది. ప్రీమియం కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడం, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, కొత్త ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ కోసం మూలధనాన్ని ఉపయోగించాలని చూస్తుంది.

వ్యాపారంపై ప్రభావం?

ఈ పెంపు వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ (ఎస్ఏ) నిష్పత్తి లేదా ప్రాఫిట్ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని బ్యాంకు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్లు తమ అవసరాలను తీర్చడంలో బ్యాంకు విఫలమైతే పెనాల్టీ ఛార్జీల నుంచి ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీఏ-జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు) ఖాతాలకు ఈ నిబంధన వర్తించదు. పెన్షనర్లు, శాలరీ అకౌంట్లు, రూ.2 లక్షల పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లకు మినహాయింపులు ఇచ్చారు.

విమర్శలు ఎందుకు?

ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్‌ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్‌ జే కోటక్ తన ఎక్స్‌ ఖాతాలో చెప్పారు.

ఇదీ చదవండి: సోదరుడికి పంపిన లీగల్‌ నోటీసు విత్‌డ్రా

బ్యాంకు చర్యల ద్వారా ప్రీమియం క్లయింట్లకు ప్రాధాన్యత ఇస్తూ, మాస్ మార్కెట్ విభాగాన్ని దూరం చేసుకుంటుందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక సమ్మిళితం(ఫైనాన్షియల్‌ ఇన్‌క్యూజన్‌) అనే విస్తృత జాతీయ లక్ష్యాన్ని ఇది బలహీనపరుస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంఏబీలను తక్కువగా లేదా జీరోగా ఉంచుతున్న తరుణంలో ఐసీఐసీఐ బ్యాంక్ బహుళ సేవా ఛార్జీలను (ఏటీఎం, విత్‌డ్రా, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్‌ మొదలైన వాటిపై) వసూలు చేస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంకు విధానానికి విరుద్ధంగా మిడ్ సైజ్ బ్యాంకులు ఎన్నో సర్వీసులు అందిస్తున్నాయి. పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులున్నాయి. ప్రాథమిక లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. రూ.25,000 ఎంఏబీతో కస్టమర్లకు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇస్తున్నాయి.

ఇతర బ్యాంకులు ఇదే బాటలో నడుస్తాయా?

బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లను పెంచడంపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న డిపాజిట్ల పోటీ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, పలు మిడ్ టైర్ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ చర్యను అనుకరించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ICICI Bank
Minimum Balance
savings account
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక

ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక

ఐసీఐసీఐ బ్యాంక్‌కి ప్రొవిజనింగ్‌ దన్ను

ఐసీఐసీఐ బ్యాంక్‌కి ప్రొవిజనింగ్‌ దన్ను

కొంచెం రిస్క్‌ ఉన్నా.. లాభం రావాలంటే?

కొంచెం రిస్క్‌ ఉన్నా.. లాభం రావాలంటే?

ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు

ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు

బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే రూ.7,500 క్యాష్‌బ్యాక్!!

సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే రూ.7,500 క్యాష్‌బ్యాక్!!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.