Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

హైదరాబాద్‌ 2.o.. అభివృద్ధి ఖాయం!

Business Sakshi User Sakshi Sakshi Time Dec 14, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hyderabad-.jpg

మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణతో నగరాభివృద్ధి

సిటీ, శివార్లకు మధ్య మెరుగైన కనెక్టివిటీ, మౌలిక వసతులు

నగరం మూడు వైపులా అందుబాటు ధరల్లో గృహాలకు అవకాశాలు

‘యూజర్‌ పే’ విధానంలో గ్రోత్‌ కారిడార్‌లో రోడ్లు

వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌తో ఫోర్త్‌ సిటీని అభివృద్ధి చేయాలి

రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే..

తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జీవీ రావు

‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్‌ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌(టీడీఏ) ప్రెసిడెంట్‌ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో

సబర్బన్‌ పాలసీ అవసరం.. 
విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్‌ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్‌ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.

ఆదాయంలో 25–30 శాతం వాటా.. 
ప్రస్తుతం గ్రేటర్‌లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్‌ ఎస్టేట్‌ రంగం. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, జీఎస్‌టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్‌ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.

‘యూజర్‌ పే’తో గ్రోత్‌ కారిడార్‌లో రోడ్లు.. 
ఓఆర్‌ఆర్‌ నిర్మాణ సమయంలోనే గ్రోత్‌ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్‌ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీతో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్‌ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్‌ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్‌ రింగ్‌ రోడ్‌ అనుసంధానించబడి రేడియల్‌ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.

వాక్‌ టు వర్క్‌తో.. ఫోర్త్‌ సిటీ.. 
తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్‌ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్‌ చేయాలి. వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్‌ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.

నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్‌.. 
హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్‌లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్‌ హైదరాబాద్‌. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్‌ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్‌ నుంచి నారాపల్లి, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Hyderabad
Development
musi project
Metro Rail
gv rao
real estate
Realty
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.