Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి!
ADVERTISEMENT

రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి!

Business Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2026 01:08 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
122.jpeg

సమాచార సాంకేతిక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాల ఉచ్చు కూడా అదే స్థాయిలో బిగుస్తోంది. కేవలం కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, డేటా బేస్‌లకే పరిమితమైన హ్యాకర్ల కన్ను ఇప్పుడు నేరుగా నిత్యవసర విభాగాలపై పడింది. తాజాగా ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, ఎస్టోనియా, ఫిన్లాండ్, లక్సెంబర్గ్ తదితర యూరోపియన్ దేశాల్లో సూపర్‌మార్కెట్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన సైబర్ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇంటర్నెట్‌కు అనుసంధానించిన రిఫ్రిజిరేటర్‌ వ్యవస్థల భద్రత ఎంత పెళుసుగా ఉందో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

ఫ్రిజ్‌లను హాట్‌గా మార్చిన హ్యాకర్లు!

సాధారణంగా సూపర్‌మార్కెట్లలోని పెద్ద శీతలీకరణ యంత్రాలను రిమోట్ ద్వారా పర్యవేక్షించడానికి, ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఫ్రాన్స్‌లో హ్యాకర్లు ఈ వ్యవస్థలోకి చొరబడి రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను అసాధారణ రీతిలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్‌హీట్) వరకు పెంచేశారు. దాదాపు ఆరు గంటల పాటు ఈ ఉష్ణోగ్రతలు అలాగే కొనసాగడంతో అందులో నిల్వ చేసిన తాజా మాంసం, కూరగాయలు, పాల ఉత్పత్తులు పూర్తిగా పాడైపోయాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో షార్ట్‌సర్క్యూట్ల కారణంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయి. ఇంటర్‌మార్చే, కార్ఫోర్ వంటి దిగ్గజ రిటైల్ సంస్థలకు చెందిన వందలాది స్టోర్లు ఈ చర్యలకు బలయ్యాయి.

యూరప్ అంతటా దాడులు

ఫ్రాన్స్‌తో ప్రారంభమైన ఈ కోల్డ్ స్టోరేజ్ సైబర్ దాడులు క్రమంగా బెల్జియం, స్వీడన్, ఎస్టోనియా తదితర దేశాలకు పాకాయి. బెల్జియంలోని డెల్‌హైజ్‌, కోల్ రుయెట్‌, ప్రసిద్ధ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా స్టోర్లతో పాటు స్వీడన్‌లోని కూప్, ఇకా వంటి సూపర్‌మార్కెట్లు కూడా ఇదే రీతిలో సాంకేతిక లోపాలను ఎదుర్కొన్నాయి. లక్షలాది యూరోల విలువైన ఆహార పదార్థాలు నిరుపయోగంగా మారడంతో రిటైల్ సంస్థలు భారీ ఆర్థిక నష్టాలను చూడాల్సి వచ్చింది. అమెరికాలో సైతం కొన్ని సైనిక స్థావరాల్లోని శీతలీకరణ యంత్రాలు ఇలాగే పాడైపోవడం వెనుక సైబర్ హ్యాకర్ల ప్రమేయం ఉందన్న అనుమానాలతో పెంటగాన్ దర్యాప్తు చేపట్టింది.

ఈ దాడులకు అసలు కారణాలు ఏమిటి?

పాత సాఫ్ట్‌వేర్: చాలా సూపర్‌మార్కెట్లు తమ పాత శీతలీకరణ కంట్రోలర్లను అలాగే వాడుతున్నాయి. ప్రముఖ తయారీ సంస్థ డ్యాన్‌ఫాస్ వంటి కంపెనీలు ఇప్పటికే కొన్ని లెగసీ మోడళ్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను నిలిపివేశాయి. అప్‌డేట్‌లు లేని ఈ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు సులభంగా ఛేదిస్తున్నారు.

లోపభూయిష్ట నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్: రిఫ్రిజిరేషన్ కంట్రోలర్లను నేరుగా ఇంటర్నెట్‌కు అనుసంధానించడం, సరైన ఫైర్‌వాల్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల బాహ్య ప్రపంచం నుంచి హ్యాకర్లకు సులభంగా మార్గం దొరుకుతోంది.

బాధ్యతల విభజనలో లోపాలు: స్టోర్ నిర్వహణ ఒకరి చేతిలో, సాఫ్ట్‌వేర్ మరొకరి చేతిలో, నెట్‌వర్క్ పర్యవేక్షణ వేరే థర్డ్-పార్టీ సంస్థ చేతిలో ఉండటం వల్ల భద్రతాపరమైన లోపాలను ఎవరూ సరిగా గుర్తించలేకపోతున్నారని ఫోర్స్‌కౌట్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ఘటనలు కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యానికి, సరఫరా వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. పాడైపోయిన ఆహారాన్ని గుర్తించకుండా వినియోగదారులకు చేరితే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్, కోల్డ్ స్టోరేజ్ సంస్థలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. పాతబడిన రిఫ్రిజిరేషన్‌ కంట్రోలర్లను వెంటనే ఆధునిక, సురక్షితమైన సిస్టమ్స్‌తో మార్చాలి. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్, బలమైన పాస్‌వర్డ్ పాలసీలు, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి విద్రోహ చర్యలను అడ్డుకోగలం. డిజిటల్ ప్రపంచంలో భద్రత అనేది కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: ఈరోజు అపరంజి ధర పెరిగిందా? తగ్గిందా?

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Hackers
supermarket
fridges
Food Safety and Standards
refrigerator
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్లడ్‌ బ్యాంకులపై సైబర్‌ దాడి.. ఏం జరిగిందంటే..

బ్లడ్‌ బ్యాంకులపై సైబర్‌ దాడి.. ఏం జరిగిందంటే..

SBI కస్టమర్లకు అలర్ట్.. 3.8 లక్షల డేటా రికార్డులు లీక్?

SBI కస్టమర్లకు అలర్ట్.. 3.8 లక్షల డేటా రికార్డులు లీక్?

ఫ్రిజ్ హ్యాకింగ్‌కు గురికాకుండా ఎలా కాపాడుకోవాలి?

ఫ్రిజ్ హ్యాకింగ్‌కు గురికాకుండా ఎలా కాపాడుకోవాలి?

పాడైన పదార్థాలు.. ఎలుకలు.. బొద్దింకలు

పాడైన పదార్థాలు.. ఎలుకలు.. బొద్దింకలు

ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం

ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం

వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో

వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft