Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?

Business Sakshi User Sakshi Sakshi Time Nov 4, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Gold01.jpg

ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్‌రావు

ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్‌ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్‌ పీరియడ్‌ ఉండదు.

లిక్విడ్‌ ఫండ్స్‌ మంచి ఎంపిక

అత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్‌ ఫండ్స్‌ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్‌ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్‌ మార్కెట్‌ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్‌ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. 

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు!

బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్‌ రిస్క్‌ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నం

ఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్‌ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ లేదా డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్‌ (నష్టం) రిస్క్‌ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్‌ రిస్క్‌ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.

- ధీరేంద్ర కుమార్‌, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
gold investments
Emergency Fund
Investment
Funds
Equity
Off Beat
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

పెరుగుతున్న పసిడి ధరలు.. ఇంకా పెరుగుతాయ్‌!

పెరుగుతున్న పసిడి ధరలు.. ఇంకా పెరుగుతాయ్‌!

క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!

క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!

నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!

నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!

‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’

‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’

బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్‌

బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.