దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పుత్తడి రేట్లు నేడు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా పెరిగిన వెండి ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?)

