Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

రుణాలు బంగారంలా పెరిగాయ్‌!

Business Sakshi User Sakshi Sakshi Time Feb 9, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gold.jpg

అప్పుల కోసం పుత్తడి తాకట్టు వైపు జనం మొగ్గు

సురక్షిత సాధనంగా అవతరించిన పసిడి

బంగారంపై తీసుకునే రుణాల్లో దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగం

రూ.1,72,581 కోట్ల రుణాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి..

ఏడాదిలో బంగారం రుణ మార్కెట్‌ వృద్ధి 71.3%

సాక్షి, బిజినెస్‌ బ్యూరో: బంగారం ధర ఒక్కటే కాదు.. బ్యాంకుల్లో పసిడి తాకట్టు రుణాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో రూ.1,01,552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు.. డిసెంబర్‌ నాటికి రూ.1,72,581 కోట్లకు చేరాయి. అదే 2023 డిసెంబర్‌తో పోలిస్తే బంగారం రుణాల్లో ఏకంగా 71.3 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. అంతకుముందు ఏడాదిలో ఇది 17 శాతమే. 

భారత్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొత్తం పసిడి రుణాలు డిసెంబర్‌ నాటికి 41.66 శాతం పెరిగి.. రూ.43,745 కోట్లకు చేరాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న గోల్డ్‌ లోన్స్‌ తీరును ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. పసిడి ధరలకు రెక్కలు రావడంతో ఆభరణాలపై అందుకునే లోన్‌ విలువ కూడా పెరిగింది. 

రుణ గ్రహీతలు తమకు ఉన్న ఇతర రుణాల చెల్లింపుల కోసం గోల్డ్‌ లోన్స్‌ తీసుకుంటున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతు న్నాయి. పెట్టుబడికే కాదు చదువులు, ఆరోగ్యం, వివాహం ఇలా ఏ అవసరంలోనైనా ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం కొనిపెట్టుకోవడం, అవసరానికి తాకట్టు పెట్టడం పెరుగుతోంది.

బంగారం లాంటి సౌలభ్యం! 
ఎవరైనా ఇతర రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్‌ హిస్టరీ తప్పదు. పైగా ప్రతి నెల ఈఎంఐ రూపంలో వడ్డీ, అసలు కట్టాల్సిందే. అదే గోల్డ్‌ లోన్‌కు ఏ అడ్డంకీ లేదు. నగలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత రుణం. చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుంది. నిర్దేశిత కాల పరిమితి ముగిసే సమయానికి బాకీపడ్డ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు, తీసుకునే మొత్తాన్ని బట్టి వార్షిక వడ్డీ 9 నుంచి 26 శాతం వరకు ఉంది. 

ఐడీ కార్డు, అడ్రస్‌ ప్రూఫ్‌ ఉంటే చాలు. 10 నిమిషాల్లో అప్పు పుడుతుంది. ఇంటికొచ్చి మరీ బంగారం రుణాలిస్తుస్న సంస్థలూ ఉన్నాయి. ఆభరణాల స్వచ్ఛతను బట్టి విలువలో 75 శాతం వరకు రుణం అందుకోవచ్చు. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు 90 శాతం వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. 

నెల నెలా వడ్డీ కట్టే విధానంగానీ, కాలపరిమితి ముగిశాక ఒకేసారి అసలు, వడ్డీ చెల్లించే విధానంగానీ ఎంచుకోవచ్చు. రుణం చెల్లించడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తారు. అయినా స్పందించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తారు.

బంగారం, రుణాల లెక్కలివీ..
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గణాంకాల ప్రకారం... 2024లో దేశంలో బంగారం డిమాండ్‌ 802.8 టన్నులుగా నమోదైంది. 2023లో ఇది 761 టన్నులు మాత్రమే. భారతీయుల వద్ద మొత్తంగా సుమారు 25,000 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నట్టు అంచనా. ఇందులో 5.6 శాతం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. 2023–24లో పుత్తడి రుణ విపణి రూ.7.1 లక్షల కోట్లుగా ఉంటే.. రెండేళ్లలోనే రెండింతలైంది. 

మొత్తం బంగారం రుణాల్లో రూరల్‌ వాటా 35%, సెమీ అర్బన్‌ 42%, అర్బన్‌ వాటా 23 శాతంగా నమోదైంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీలు అందిస్తున్న బంగారం రుణాల్లో రూ.30,000లోపు తీసుకునేవే 50శాతం దాకా ఉన్నాయి. అన్‌సెక్యూర్డ్‌ లోన్స్, క్రెడిట్‌ కార్డుల కంటే గోల్డ్‌ లోన్‌ చవక. బంగారం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 63 శాతంకాగా.. మిగిలినది ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకులది.

ఇతర రుణాలు కఠినతరం కావడంతో..
బ్యాంకుల కఠిన నిబంధనల కారణంగా పర్సనల్‌ లోన్లు, క్రెడిట్‌కార్డులు వంటి అన్‌సెక్యూర్డ్‌ రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణగ్రహీతలు ప్రత్యామ్నాయంగా బంగారం రుణాలపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత రుణాల విభాగం 2023 డిసెంబర్‌లో నమోదైన 20.8%తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో వృద్ధి 9.7 శాతమే కావడం గమనార్హం. 

క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు 2024 డిసెంబర్‌లో 15.6% పెరిగాయి. ముందటి ఏడాదిలో ఇది 32.6%. గృహ, వాహనాలు, క్రెడిట్‌ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు సహా రిటైల్‌ లోన్‌ విభాగంలో బ్యాంకుల రుణాల వృద్ధి 2023 డిసెంబర్‌లో 17.6% నుంచి 2024డిసెంబర్‌లో 14.9 శాతానికి తగ్గిపోయిందని రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

స్టేట్‌ బ్యాంకులో గోల్డ్‌లోన్‌ ఇలా..
ఎస్‌బీఐ.. 18–22 క్యారెట్ల ఆభరణాల స్వచ్ఛతను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ప్రతి 10 గ్రాములకు రూ.45,000 వరకు రుణం ఇస్తోంది. రుణ గ్రహీత మూడేళ్ల వరకు వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత లోన్‌ను రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్‌ రీపేమెంట్‌ విధానంలో 6 నెలలు లేదా 12 నెలల వ్యవధిని ఎంచుకోవచ్చు. 

ఈ విధానంలో గరిష్టంగా 10 గ్రాములకు రూ.48,000 వరకు లోన్‌ అందుకోవచ్చు. ప్రతి నెలా నిర్ధేశిత వడ్డీ చెల్లించాలి. టెన్యూర్‌ ముగిసే ముందు అసలు మొత్తాన్ని కట్టి లోన్‌ను క్లోజ్‌ చేసుకోవాలి. అయితే గోల్డ్‌ లోన్‌పై 90 రోజులపాటు వడ్డీ చెల్లించకపోతే ఖాతా ఎన్‌పీఏ (మొండి బకాయి) అవుతుంది. ఆ తర్వాత 90 రోజుల దాకా కూడా కస్టమర్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే బంగారాన్ని వేలం వేస్తారు. 

ధర పెరిగి.. ఎక్కువ రుణం.. 
పసిడి ధర పెరిగిపోతుండటంతో దానిపై అందుకునే లోన్‌ మొత్తమూ పెరుగుతోంది. దీనితో జనం తమ అవసరాల కోసం బంగారం లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. పుత్తడి ధర హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.87,650 దాటింది. గతేడాది ధర సుమారు రూ.64,000 మాత్రమే కావడం గమనార్హం.

బంగారంపై రుణాల తీరు ఇదీ.. 
వార్షిక వడ్డీ: 9% నుంచి 26% వరకు 
రుణమిచ్చేది: కనిష్టంగా రూ.1,500 నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు 
కాల పరిమితి: 7 రోజుల నుంచి 4 ఏళ్ల వరకు.. 
ఆభరణం విలువలో రుణం: గరిష్టంగా 75 శాతం 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
gold loans
SBI
reserve bank of india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎస్‌బీఐ మేనేజర్ జీతం రూ. 35 లక్షలా?

ఎస్‌బీఐ మేనేజర్ జీతం రూ. 35 లక్షలా?

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

రాజకీయ'దుర్గం'!

రాజకీయ'దుర్గం'!

రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఉన్నత స్థాయి సమీక్ష

రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఉన్నత స్థాయి సమీక్ష

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీవోకి ఓకే..

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీవోకి ఓకే..

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.