Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్‌ కోడ్‌ వచ్చేస్తుందా?

Business Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
labour-.jpg

మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్‌లో లేబర్ కోడ్‌లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్‌లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.

మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్‌
లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్‌లోనే ప్రభుత్వం ఈ కోడ్‌లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్‌ కోడ్‌లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్‌ శ్లాబ్‌ రాబోతోందా?

మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్‌లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్‌లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్‌ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.

రాష్ట్రాలతో చర్చలు
ఈ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్‌పై కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఏమిటీ లేబర్ కోడ్‌లు?
భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్‌లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.

4 రోజులు పని.. 3 రోజులు సెలవు
కొత్త లేబర్ కోడ్‌లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్‌ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
labor
code
Union Budget 2025-26
four days
Work
new rules
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

ఇండియన్ రైల్వే కొత్త రూల్స్!

ఇండియన్ రైల్వే కొత్త రూల్స్!

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.