Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

EPFO: ఇక 100% ఈపీఎఫ్‌ విత్‌డ్రా!

Business Sakshi User Sakshi Sakshi Time Oct 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
EPFO_News.jpg

విత్‌డ్రా నిబంధనలు మరింత సులభతరం  

పాక్షిక ఉపసంహరణల పరిమితులు పెంపు 

మూడు కేటగిరీలుగా విభజన 

సెంట్రల్‌ బోర్డు కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఇకపై తమ ముఖ్యమైన అవసరాల కోసం భవిష్యనిధి నుంచి నూరు శాతం (తన వాటా, యాజమాన్యం వాటాలు) ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన భేటీ అయిన ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సభ్యుల జీవనాన్ని సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్షిక ఉపసంహరణల పరిమితులను సైతం పెంచింది. 13 క్లిష్టమైన నిబంధనలన్నింటినీ కలిపేసి ఒక్కటిగా మార్చింది. నిత్యావసరాలు (అనారోగ్యం, విద్య, వివాహ అవసరాలను), గృహావసరాలు, ప్రత్యేక అవసరాలు పేరుతో ఉపసంహరణలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది.  

విద్యావసరాల కోసం 10 పర్యాయాలు భవిష్యనిధిని వెనక్కి తీసుకోవచ్చు. వివాహం కోసం 5 పాక్షిక ఉపసంహరణలకు ఇకపై అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండింటి కోసం మూడు పర్యాయాలు మాత్రమే అనుమతించేవారు.  

ఇకపై పాక్షిక ఉపసంహరణలకు 12 నెలల కనీస సర్వీస్‌ (పదవీకాలం) ఉంటే సరిపోతుంది.  

ప్రత్యేక సందర్భాల్లో భవిష్యనిధి ఉపసంహరణకు గాను.. ప్రకృతి విపత్తు, సంస్థల మూసివేత/ఉద్యోగుల తొలగింపు, ఉపాధి లేకుండా ఉండడం, అంటువ్యాధి తదితర వాటిల్లో ఒక కారణాన్ని పేర్కొనాల్సి వచ్చేది. దీంతో ఉపసంహరణ దరఖాస్తులు కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురయ్యేవి. ఇకపై ప్రత్యేక అవసరాల కోసం చేసే పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని వెల్లడించనక్కర్లేదు. 

సభ్యులు తమ చందా మొత్తంలో 25% కనీస బ్యాలన్స్‌గా అన్ని సమయాల్లోనూ కొనసాగించాల్సి ఉంటుంది. తద్వారా అధిక వడ్డీ రేటు ప్రయోజనం, కాంపౌండింగ్‌ ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఒకవైపు తాత్కాలిక అవసరాలకు నిధుల సాయం పొందుతూ.. మరోవైపు రిటైర్మెంట్‌ సమయానికి కొంత నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా దీన్ని ప్రవేశపెట్టారు. మిగిలిన వాటా నుంచి 100% తీసేసుకోవచ్చు. 

ఈపీఎఫ్‌వో తుది సెటిల్‌మెంట్‌ను ప్రస్తుతం రెండు నెలల ముందుగా పొందడానికి అవకాశం ఉండగా, దీన్ని 12 నెలలకు పెంచారు. తుది పింఛను ఉపసంహరణ గడువును సైతం 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు.  

ఈపీఎస్‌ 95 పింఛనుదారులు తమ ఇంటి నుంచే డిజిటల్‌ లైఫ్‌ సరి్టఫికెట్‌ను సమర్పించేందుకు వీలుగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో అవగాహన ఒప్పందానికి ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు పెన్షనర్లు ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.  

జరిమానాలను క్రమబద్దీకరించడం ద్వారా వివాదాలను తగ్గించేందుకు ‘విశ్వాస్‌ స్కీమ్‌’ను ఈపీఎఫ్‌వో తీసుకొచి్చంది. పీఎఫ్‌ చందాలను సంస్థలు ఆలస్యంగా జమ చేయడం జరిమానాలకు ప్రధాన కారణమని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. 2025 మే నాటికి ఇలాంటి జరిమానాలు, నష్ట పరిహారం మొత్తం రూ.2,406 కోట్లుగా ఉంది. విశ్వాస్‌ స్కీమ్‌ కింద జరిమానా  మొత్తాన్ని ఫ్లాట్‌ 1%కి తగ్గించారు.  

కాగా, ఈపీఎఫ్‌వో డెట్‌ పెట్టుబడుల నిర్వహణకు నాలుగు ఫండ్‌ మేనేజర్ల (హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌) ఎంపికకు సైతం సెంట్రల్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది.

ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
EPFO
EPF withdrawal
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఈ నెల్లోనే ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ

ఈ నెల్లోనే ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

పీఎఫ్‌ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..

పీఎఫ్‌ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..

ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..

ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.