Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్‌గేట్‌’పై మస్క్‌ విమర్శలు

Business Sakshi User Sakshi Sakshi Time Jan 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
musk01.jpg

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్(Donald Trump) మద్దతు ఉన్న స్టార్‌గేట్‌ ఏఐ(Stargate) ప్రాజెక్టును ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దాంతో ఓపెన్ఏఐ(OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో సామాజిక మాధ్యమాలు వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌ల జాయింట్ వెంచర్ అయిన స్టార్‌గేట్‌ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు సన్నిహితుడు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న మస్క్ స్టార్‌గేట్‌ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.

మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో తన సందేహాలను వ్యక్తం చేశారు. ‘వారి(ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌) వద్ద నిజంగా డబ్బు లేదు. సాఫ్ట్ బ్యాంక్ 10 బిలియన్‌ డాలర్ల వరకే వెచ్చించనుంది. నాకు దానిపై పూర్తి అవగాహన ఉంది’ అన్నారు. వెంటనే స్పందించిన ఆల్ట్‌మన్‌, మస్క్ వాదనలను ఖండిస్తూ టెక్సాస్‌లోని ప్రాజెక్ట్‌ తొలి నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఆల్ట్‌మన్‌ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ‘ఇది దేశానికి గొప్ప ప్రాజెక్ట్‌. దేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టైనా మీ కంపెనీలకు అనువైనది కాదని నాకు అర్థం అయింది. కానీ మీరు కొత్త స్థానంలో(డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ) అమెరికాను ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు..

ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్‌ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్‌ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’

స్టార్‌గేట్‌ ప్రాజెక్ట్

అధ్యక్షుడు ట్రంప్ స్టార్‌గేట్‌ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ‘అమెరికా సామర్థ్యంపై విశ్వాసం కలిగించే గొప్ప ప్రకటన’గా అభివర్ణించారు. అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లు, విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించాలని ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే టెక్సాస్‌లో నిర్మాణాన్ని ప్రారంభించింది.

సత్య నాదెళ్ల వద్ద 80 బిలియన్‌ డాలర్లు

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్లను స్టార్‌గేట్‌ ప్రాజెక్టుకు సంబంధించి మస్క్ వాదనలపై ప్రశ్నించగా..‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు ప్రత్యేకంగా తెలియదు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం డబ్బు లేదని ఎక్స్‌లో మస్క్ చేసిన పోస్టుల గురించి అడిగినప్పుడు ‘మా వద్ద ఉన్న 80 బిలియన్ డాలర్లతో మేము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాం’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మస్క్  ‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’ అని బదులిచ్చారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
elon musk
Sam Altman
OpenAI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.