Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఆ రియల్‌​ ఎస్టేట్‌ స్కీమ్‌లకు ఆశపడితే..

Business Sakshi User Sakshi Sakshi Time Nov 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
real.jpg

బిల్డర్లు, కస్టమర్ల దురాశతోనే ప్రీలాంచ్‌ మోసాలు

తక్కువ ధర ఎరతో కొనుగోలుదారులకు గాలం

కొనుగోలుకు ముందు అప్రమత్తత అవసరం

ప్రీలాంచ్, బైబ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్‌ స్పేస్, రెంటల్‌ స్కీమ్‌.. పేర్లు ఏమైనా ఇవన్నీ కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేసే స్కీమ్‌లే. నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం.. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి.

ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్‌ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్‌పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవడం లేదు? సగం ధరకే ఫ్లాట్‌ అనగానే నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్‌ చేతిలో పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్‌?

భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారుడికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో నమ్మకమే కొరవడింది. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభం చూసే భూయజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. ఇలా అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు.

నిధుల మళ్లింపుతో.. 
వ్యాపారంలో షార్ట్‌కర్ట్‌ దురుద్దేశంతో కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్‌ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్‌ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు.

అధ్యయనం చేయకుండానే.. 
ప్రీలాంచ్, యూడీఎస్‌ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసేందుకు వందలాది మంది బిల్డర్లు పుట్టుకొస్తున్నారు. కొంత మంది కొనుగోలుదారులు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్‌ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పిస్తుండటంతో ప్రీలాంచ్‌ మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రీలాంచ్‌ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను కఠినంగా శిక్షించాలి. కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో మోసపోకుండా జాగ్రత్తపడాలి.  

కొనేముందు గమనించాల్సినవి ఇవే..

  • నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.

  • ప్రాజెక్ట్‌ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.

  • డెవలపర్‌ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.

  • గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.

  • పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా తెలుసుకోవాలి.

  • ప్రాజెక్ట్‌ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.

  • డెవలపర్‌ లేదా కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
real estate scam
Rental
schemes
buy back
Pre-launch
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు

తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు

15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..

15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..

ఆఫీస్‌ మార్కెట్‌కు  అడ్డా.. హైదరాబాద్‌ 

ఆఫీస్‌ మార్కెట్‌కు  అడ్డా.. హైదరాబాద్‌ 

బడ్జెట్ 2026:: వరాలు లేవు.. శరాలు లేవు..

బడ్జెట్ 2026:: వరాలు లేవు.. శరాలు లేవు..

ప్రతీ నెలా రూ.10 వేల పొదుపుతో కోటీశ్వరులయ్యారు.. సూపర్ హిట్ స్కీమ్ మీ కోసం

ప్రతీ నెలా రూ.10 వేల పొదుపుతో కోటీశ్వరులయ్యారు.. సూపర్ హిట్ స్కీమ్ మీ కోసం

సగం ధరకే ఫ్లాట్‌!! ఇంత తక్కువకు ఇస్తున్నారంటే...

సగం ధరకే ఫ్లాట్‌!! ఇంత తక్కువకు ఇస్తున్నారంటే...

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.