Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

మొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు ఆవిష్కరణ!

Business Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
carr.jpg

భారతదేశంలో డ్రైవర్‌లెస్ కారు.. ఇదేదో అంతర్జాతీయ కంపెనీ తయారు చేసిన కారు అనుకుంటే పొరపడినట్లే. టెక్నాలజీ, ఆవిష్కరణల్లో భారత్‌ దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా ఇటీవల దేశీయంగా డ్రైవర్‌లెస్‌ కారు ఆవిష్కరించారు. విరిన్‌(WIRIN) ప్రాజెక్ట్ పేరుతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro), ఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు(Driverless Car)ను ఆవిష్కరించారు.

సాధారణ ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేని ఇరుకైన, గుంతలతో నిండిన భారతీయ రోడ్లకు అనుగుణంగా అటానమస్ వాహనాన్ని రూపొందించడం పెద్ద సవాలు. ఈ కారు ఆవిష్కరణ భారతదేశపు రవాణా వ్యవస్థలో సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు ఒక ముఖ్యమైన ముందడుగుగా కొందరు భావిస్తున్నారు.

ప్రత్యేకతలివే..

  • విదేశీ అటానమస్ వాహనాలు భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేసేవి కావు. కానీ ఈ కొత్త కారును దేశీ రోడ్ల నిర్మాణానికి అనువుగా తయారు చేశారు.

  • రోడ్డుపై ఉంటే గుంతలు, ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా గుర్తించి, అందుకు అనువుగా స్పందించేలా రూపొందించారు.

  • ఈ WIRIN ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్‌లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.

  • ఈ వాహనం అడ్వాన్స్‌డ్ సెన్సార్ల సహాయంతో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారులు, ఇతర అడ్డంకులను గుర్తించి, సురక్షితంగా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు.

ఈ డ్రైవర్‌లెస్ కారు రూపకల్పనకు ఆరేళ్లు సమయం పట్టింది. దీన్ని అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ 2019లో విప్రో, ఐఐఎస్‌సీ మధ్య సహకారంతో మొదలైంది. ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థుల బృందం ఇంజినీరింగ్, రూపకల్పన సహాయాన్ని అందించింది. అటానమస్ డ్రైవింగ్ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ ట్రాఫిక్ నమూనాల నుంచి నిరంతరం నేర్చుకునేలా  మెషిన్ లెర్నింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. కెమెరాలు, సెన్సార్ల నుంచి వచ్చే దృశ్య డేటాను విశ్లేషించి పరిసరాలను అర్థం చేసుకునేలా విజువల్ కంప్యూటింగ్‌ను ఉపయోగించారు.

🚨 India’s first driverless car has been unveiled by IISc, Wipro, and RV College in Bengaluru. pic.twitter.com/AlnNvnAPkc

— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2025

ఈ వాహనం ప్రస్తుతం పరీక్ష దశలో(Testing Phase) ఉంది. పరిశోధకులు భారతీయ రోడ్ పరిస్థితులను పూర్తిగా మ్యాపింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: యూఎస్‌లో ఈఏడీ ఆటోమెటిక్‌ పొడిగింపు రద్దు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Indigenous Technology
driverless car
IISC
Wipro
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

నేవీకి నూతన శక్తి 

నేవీకి నూతన శక్తి 

టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?

టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?

ప్రయోగం నుంచి వినియోగం వైపు 

ప్రయోగం నుంచి వినియోగం వైపు 

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త

సిందూర్‌తో బలం చాటాం: మోదీ

సిందూర్‌తో బలం చాటాం: మోదీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.