Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?

Business Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rbii.jpg

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్‌ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.

బడ్జెట్ ప్రతిపాదనలు

2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్‌లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.

నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకత

గ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్‌బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..

  • విద్యుత్తు బిల్లుల చెల్లింపులు

  • నీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు

  • ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రయోజనాలు

యుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్‌వర్తినెస్‌’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.

చట్టపరమైన, సాంకేతిక సవాళ్లు

ప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.

గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Credit
cibil
RBI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు

ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

ఎన్నారైల బ్యాంక్‌ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఎన్నారైల బ్యాంక్‌ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

యువతకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌!

యువతకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.