Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతో చైనా ఆర్థిక వ్యవస్థకు తంటాలు!

Business Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
China-economy-real-estate.jpg

చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్‌–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది. 

2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్‌’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్‌ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి. 

పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్‌ అనలిటిక్స్‌ ఆర్థికవేత్త మార్క్‌ హాప్కిన్స్‌ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి. 

జనాభా తగ్గడం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు

గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్‌ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్‌ మాదిరిగా ఉపయోగపడింది. 

స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి. 

ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్‌–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్‌ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్‌ ఎస్టేట్‌ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్‌ వంటి 50కి పైగా బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది. 

ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్‌ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్‌ ఎస్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్‌ నిరూపిస్తోంది.

- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
China economy
trouble
Real estate companies
V.VijaySaiReddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రెరా వార్నింగ్‌.. నోటీసులు

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రెరా వార్నింగ్‌.. నోటీసులు

సురక్షితంగా ల్యాండ్‌ అయిన బిల్‌గేట్స్‌ విమానం

సురక్షితంగా ల్యాండ్‌ అయిన బిల్‌గేట్స్‌ విమానం

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు కకావికలం.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయమూ అందక విలవిల

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు కకావికలం.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయమూ అందక విలవిల

డొల్ల కంపెనీలతో బాబు భూ కుంభకోణం

డొల్ల కంపెనీలతో బాబు భూ కుంభకోణం

భవనాలు కట్టే కంపెనీలకు భూ పందేరం.. ఐటీ ముసుగులో ‘రియల్‌’ లూటీ!

భవనాలు కట్టే కంపెనీలకు భూ పందేరం.. ఐటీ ముసుగులో ‘రియల్‌’ లూటీ!

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.