Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

అధిక రాబడులకు మార్గం!

Business Sakshi User Sakshi Sakshi Time Jul 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
quant01.jpg

క్వాంట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ రివ్యూ

ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్‌ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌ క్యాప్స్‌లో కాకుండా.. తమ రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి. చిన్న కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువ. కానీ, బలమైన ఆర్థిక మూలాలతో, మంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే చిన్న కంపెనీలు దీర్ఘకాలంలో మధ్య స్థాయి, బడా కంపెనీలుగా అవతరించగలవు. అటువంటి గొప్ప కంపెనీలను ముందుగా గుర్తించే నైపుణ్యాలు రిటైల్‌ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఉండవు. కనుక ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్‌ పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఆధారపడడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఈ విభాగంలో క్వాంట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మంచి రాబడులను అందిస్తోంది.

రాబడులు

ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ అద్భుతమైన రాబడులను అందించినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏటా 33 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో ఏటా 46 శాతం, ఏడేళ్లలో 27.60 శాతం, పదేళ్లలో 21 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర  ఈ పథకంలో నమోదైంది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడి కంటే  ఈ పథకంలోనే 10–12 శాతం వరకు వివిధ కాలాల్లో అధిక రాబడి వచ్చింది. ఈ పథకం 1996లో ప్రారంభమైంది. గతంలో క్వాంట్‌ ఇనకమ్‌ ఫండ్‌ పేరుతో కొనసాగింది. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తే 14.43 శాతం ఎక్స్‌ఐఆర్‌ఆర్‌ రాబడి ఆధారంగా రూ.4.08 కోట్లు సమకూరేది.  

పెట్టుబడుల విధానం..

‘క్వాంట్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ తాను అనుసరించే డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ విధానం కారణంగా అధిక ఆల్ఫాతో బలంగా నిలబడగలిగింది. అలాగే స్టాక్స్‌ ఎంపిక కోసం అనుసరించే చురుకైన విధానాలు, అదే సమయంలో సానుకూల మార్కెట్‌ పనితీరుతో మంచి పనితీరు చూపించింది. అధిక వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఫండ్‌ మేనేజర్లలో ఉండడం అనుకూలించింది’ అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలిపారు. అయినప్పటికీ చిన్న కంపెనీలు స్వల్ప కాలంలో దిద్దుబాట్లకు గురవుతుంటాయని.. లిక్విడిటీ సమస్య కూడా ఉంటుందన్నారు. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించిన వారికి మెరుగైన రాబడులు వస్తాయని సూచించారు. ప్రధానంగా అధిక వృద్ధి సామర్థ్యాలను, రంగాల వారీ సానుకూల సైకిల్స్‌ను ఫండ్‌ మేనేజర్లు ఆరంభ దశలో గుర్తించి ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడుల దిశగా ప్రయతి్నంచడం ఈ పథకంలో గుర్తించొచ్చు. అధిక రిస్క్‌ ఉన్న వారికే ఈ తరహా స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ అనుకూలమన్నది మర్చిపోవద్దు.

ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా 

పోర్ట్‌ఫోలియో

ప్రస్తుతం రూ.28,205 కోట్ల పెట్టుబడులు ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 92.78 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ సాధనాల్లో 1.44% పెట్టుబడులు ఉన్నాయి. 5.79% మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పేరుకు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అయినప్పటికీ స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు ప్రస్తుతం 31% మేరే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 43% మేర ఇన్వెస్ట్‌ చేయగా, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 24% మేర ఎక్స్‌పోజర్‌ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం స్మాల్‌క్యాప్‌ కంపెనీల విలువలు గరిష్ట స్థాయిలకు చేరినందున ఎక్స్‌పోజర్‌ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా విభాగాల వ్యాల్యూషన్ల ఆధారంగా ఈ పెట్టుబడులను మారుస్తుండడం గమనించొచ్చు. అత్యధికంగా 17.56% పెట్టుబడులను ఇంధన రంగ, యుటిలిటీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. కన్జ్యూమర్‌ డిస్క్రీషనరీ కంపెనీల్లో 16%, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లో 15%, హెల్త్‌ కేర్‌ కంపెనీల్లో 14% చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
small cap
fund
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ట్రంప్ బిగ్ గేమ్‌! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్‌

ట్రంప్ బిగ్ గేమ్‌! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్‌

వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు

వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు

ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్‌ ఫోటోలు

ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్‌ ఫోటోలు

ఎస్‌బీఐ వెంచర్స్‌ టార్గెట్‌ రూ. 2,000 కోట్లు

ఎస్‌బీఐ వెంచర్స్‌ టార్గెట్‌ రూ. 2,000 కోట్లు

భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర

భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర

టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు నిధులు

టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు నిధులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.