Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’

Business Sakshi User Sakshi Sakshi Time Jul 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bioo.jpg

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.

‘భారత్‌లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్‌వర్క్‌ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్‌ ఖాతాలో రాశారు.

కమిటీ ఏర్పాటు..

హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.

భాజపా రాజకీయ లబ్ధి కోసం..

కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.

COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0

— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025

ఇదీ చదవండి: ‘ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌బీఐ తీరు’

వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రం

సిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్‌ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్‌కు ముందు, కొవిడ్‌ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Biocon
Kiran Mazumdar Shaw
Siddharamaiah
COVID-19
vaccine
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

మళ్లీ కరోనా వైరస్‌ కలకలం!

మళ్లీ కరోనా వైరస్‌ కలకలం!

ఏఐతో కరోనా టీకా డిజైన్‌

ఏఐతో కరోనా టీకా డిజైన్‌

కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!

కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!

కర్ణాటకలో కుర్చీ కుమ్ములాట

కర్ణాటకలో కుర్చీ కుమ్ములాట

28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.